national open athletics championships: రెట్టింపు ఉత్సాహంతో జాతీయ అథ్లెటిక్ పోటీలు

author img

By

Published : Sep 18, 2021, 4:33 PM IST

national open athletics championships 2021 reached to fourth day at hanumakonda

జాతీయ స్థాయి అథ్లెటిక్​ ఛాంపియన్ షిప్‌ పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. నాలుగో రోజుకు చేరుకున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

రెట్టింపు ఉత్సాహంతో జాతీయ అథ్లెటిక్ పోటీలు

హనుమకొండలో జరుగుతున్న జాతీయ స్థాయి అథ్లెటిక్​ ఛాంపియన్ షిప్‌ పోటీలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అత్యంత ఉత్సహభరితంగా జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడకారులు రెట్టింపు ఉత్సహంతో పాల్గొని తమ ప్రతిభ కనబరుస్తున్నారు. హైజంప్, లాంగ్ జంప్‌, రన్నింగ్, జావలిన్ త్రో, పోల్ వాల్ట్, ట్రిపుల్ జంప్ పోటీలలో గెలుపే లక్ష్యంగా పోటీ పడుతూ పతకాలు సాధిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడకారులు పతకాల కోసం నువ్వా... నేనా... అన్నట్లుగా ఆడుతున్నారు.

నిట్‌లో జాతీయ స్థాయి వాకింగ్ పోటీలలో క్రీడకారులు తమ సత్తాను చాటుతున్నారు. 50 కిలో మీటర్ల వాకింగ్ చేసి హౌరా అనిపించారు. 48 క్రీడా విభాగాల్లో మొత్తం 573 మంది క్రీడకారులు పాల్గొననున్నారు. జాతీయ స్థాయి క్రీడలను చూడటానికి నగరవాసులు భారీగా తరలివస్తున్నారు. తొలిసారిగా హనుమకొండలో జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలు జరుగుతుండటం వల్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.