Minister errabelli on new farm laws: 'రైతుల పోరాటాలు, కేసీఆర్​ ధర్నాతో కేంద్రం దిగొచ్చింది'

author img

By

Published : Nov 19, 2021, 7:51 PM IST

Updated : Nov 19, 2021, 8:53 PM IST

minister errabelli dayakar rao, repeal of new farm laws

దిల్లీలో రైతుల పోరాటాలు, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ధర్నాతో​ కేంద్రం దిగి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు(Minister errabelli on new farm laws) అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ.. రైతులకు కేసీఆర్​ అండగా నిలిచారని కొనియాడారు. హనుమకొండలో తెరాస నేతలు వినయ్​ భాస్కర్​, బండా ప్రకాశ్​తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

నూత‌న వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రక‌టించ‌డంపై.. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు హర్షం(Minister errabelli on new farm laws) వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమాన్ని మ‌రిచి కార్పొరేట్ సంస్థల‌కు అనుకూలంగా కేంద్రం నూతన సాగు చట్టాలను తీసుకువచ్చిందని ఎర్రబెల్లి ఆరోపించారు. నల్ల చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా అలుపెరుగ‌ని పోరాటాలు చేసిన రైతుల‌కు సీఎం కేసీఆర్ అండ‌గా నిలిచార‌ని గుర్తుచేశారు. హనుమకొండలో మంత్రి దయాకర్ రావు.. ప్రభుత్వ చీఫ్ విప్‌ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాల‌కు మంత్రి సంతాపం, సానుభూతి తెలియజేశారు.

రైతుల పోరాటాలు, కేసీఆర్​ ధర్నాతో కేంద్రం దిగొచ్చింది: ఎర్రబెల్లి

అండగా నిలిచారు

రాష్ట్రంలో వ్యవ‌సాయాన్ని అభివృద్ధి చేస్తూ, రైతులకు అండ‌గా కేసీఆర్ నిలిచార‌ని ఎర్రబెల్లి(Minister errabelli on new farm laws) అన్నారు. సాగు చట్టాలను సీఎం.. మొద‌టి నుంచి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆదేశాల‌తో పార్లమెంటులో న‌ల్ల చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా తెరాస ఎంపీలు బాయ్​కాట్ చేశార‌ని గుర్తు చేశారు. దేశ‌వ్యాప్తంగా రైతుల‌ను ఏకం చేసేందుకు శ్రీ‌కారం చుట్టి.. ధ‌ర్నాలు చేప‌ట్టడంతోనే మోదీ ప్రభుత్వం దిగివ‌చ్చింద‌ని స్పష్టం చేశారు.

'కేసీఆర్​ బహుభాషా కోవిదుడు. ధాన్యం కొనుగోళ్లు, సాగు చట్టాల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు పోరాడేలా చేయాలని చూశారు. రైతుల పోరాటాలు, సీఎం కేసీఆర్‌ ధర్నాతో కేంద్రం దిగొచ్చింది. ఆరంభం నుంచి కేసీఆర్‌ సాగుచట్టాలను వ్యతిరేకించారు. రైతులకు​ అండగా నిలిచారు. రైతుల పోరాట స్ఫూర్తితో కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం. ఇకనైనా రాష్ట్ర భాజపా నాయకులు, విపక్షాలు తీరు మార్చుకోవాలి.' -ఎర్రబెల్లి దయాకర్​ రావు, పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి

కేసీఆర్​ అంగీకరించలేదు

అన్నదాతల కోసం రైతుబంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మించి అండ‌గా ఉన్నార‌ని ఎర్రబెల్లి(Minister errabelli on new farm laws) అన్నారు. నూత‌న సాగు చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌పై ఒత్తిడి తెచ్చినా.. తెలంగాణలో అమ‌లు చేయ‌డానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ అంగీకరించలేదన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించి రైతులకు అండ‌గా నిలిచారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మన అదృష్టం

వ్యవ‌సాయం ప‌ట్ల పూర్తి అవ‌గాహ‌న క‌లిగిన నాయ‌కుడు ముఖ్యమంత్రిగా ఉండ‌టం తెలంగాణ ప్రజల అదృష్టమని ఎర్రబెల్లి దయాకర్​ రావు(Minister errabelli on new farm laws) అన్నారు. ఇప్పటికైనా భాజపా, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బుద్ధి తెచ్చుకొని రైతు వ్యతిరేక నిర్ణయాల‌ను వ‌దిలేయాలని హితవు పలికారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు తెరాస ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో క‌లిసి రావాల‌ని సూచించారు.

ఇవీ చదవండి: Revanth reddy on paddy procurement: 'ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరి తప్పదు'

'సాగు చట్టాలపై ఎంపీ నామ హర్షం.. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్'​

R. Narayana Murthy latest news : ప్రధాని మోదీని లార్డ్ మింటోతో పోల్చిన ఆర్‌.నారాయణమూర్తి

Last Updated :Nov 19, 2021, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.