DUSSEHRA CELEBRATIONS 2021: బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో.. భద్రకాళి అమ్మవారు

author img

By

Published : Oct 7, 2021, 10:43 AM IST

DUSSEHRA CELEBRATIONS 2021

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిస్తున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెంది.. వరంగల్‌ వాసుల ఇలవేల్పుగా నిలిచిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు భద్రకాళి అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు వృషభ వాహన సేవలో పాల్గొననున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సాయంత్రం జగన్మాతకు మృగ వాహనసేవ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్ పాల్గొన్నారు. అమ్మవారి నామ స్మరణలతో దేవాలయం మార్మోగింది.

దేవీ నవరాత్రి ఉత్సవాలు

ఇదీ చూడండి: DUSSEHRA 2021: దసరా సంబురాలు.. అమ్మ మెచ్చే నైవేద్యాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.