KCR Wanaparthy Tour: వనపర్తి జిల్లా బంగారుపర్తి కావాలె: సీఎం కేసీఆర్​

author img

By

Published : Mar 8, 2022, 2:02 PM IST

Updated : Mar 8, 2022, 3:52 PM IST

CM KCR Visit in wanaparthy and started mana uru mana badi program

CM KCR Visit in wanaparthy: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు మాయమైందని సీఎం కేసీఆర్​ అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమీకృత కలెక్టరేట్​ భవనం ప్రారంభం అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. వనపర్తి మున్సిపాలిటీకి రూ.కోటి ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దాంతోపాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు.

CM KCR Visit in wanaparthy: జిల్లాల్లో ఎవరూ ఊహించని అభివృద్ధి జరుగుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. నా రాష్ట్రం, నా జిల్లా అనే తపన ఉంటే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మార్కెట్​యార్డును ప్రారంభించారు. జిల్లా నుంచే 'మన ఊరు- మన బడి' కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ శ్రీకారం చుట్టారు. అనంతరం తెరాస కార్యాలయం, సమీకృత కలెక్టర్​ను ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్​ మాట్లాడారు. వనపర్తి మున్సిపాలిటీకి రూ.కోటి ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దాంతోపాటు ఇతర మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు, జిల్లాలోని గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరుచేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు మాయమైందన్నారు. మహిళలకు ఉమెన్స్​ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా మన కలెక్టరేట్లులా లేవని మన అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కరవు మాయమై.. పంటలు పండుతున్నాయి. అద్భుతమైన రూపం వచ్చింది. దేశంలోని అనేక విషయాల్లో తెలంగాణ నంబర్​ వన్​ స్థానంలో ఉంది. తలసరి విద్యుత్​ వినియోగం, తలసరి వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్​ వన్​. జీఎస్​డీపీలో తెలంగాణ ముందువరసలో ఉంది. ఇంటింటికి నల్లా నీళ్లిచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కంటే గ్రోత్​రేట్​ తెలంగాణలోనే ఎక్కువ. వనపర్తిలో ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎవరూ కలగనలే. వనపర్తి జిల్లా బంగారుపర్తి కావాలి.

సీఎం కేసీఆర్​.

CM KCR Wanaparthy Tour: వనపర్తి జిల్లా బంగారుపర్తి కావాలె: సీఎం కేసీఆర్​

భుజాలు తట్టి ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్​..

హెలికాప్టర్‌ ద్వారా బేగంపేట నుంచి వనపర్తి సమీపంలోని చిట్యాల గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గ్రామ శివారులో 44 కోట్ల 50 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్​ లక్ష్మారెడ్డిని కార్యాలయంలోని కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్విదించారు. స్థానిక ప్రజాప్రతినిధులను భుజాలు తట్టి ఆప్యాయంగా పలకరించారు. ఆ కమిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్​ గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఉన్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్​ కుమార్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రామలు పాల్గొన్నారు.

'మన ఊరు- మన బడి'కి శ్రీకారం..

అనంతరం మన ఊరు- మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్​ శ్రీకారం చుట్టారు. పైలాన్​ను ఆవిష్కరించారు. తామంత ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నతస్థాయికి వచ్చిన వాళ్లమేనని గుర్తు చేసుకున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు రాబోతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభం కానుందని చెప్పారు. విద్యార్థులు.. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు.

వనపర్తిలో సీఎం కేసీఆర్​.. 'మన ఊరు-మన బడి' కార్యక్రమానికి శ్రీకారం

కేసీఆర్‌కు దట్టి కట్టి..

అనంతరం జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరం గ్రామ శివారులోని తెరాస పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడికి చేరుకున్న కేసీఆర్‌కు మహిళా నేతలు స్వాగతం పలికారు. అనంతరం తెరాస పార్టీ జెండావిష్కరించి.. నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నేతలు కేసీఆర్‌కు దట్టి కట్టి ఆశీర్వదించారు.

మంత్రి నిరంజన్​రెడ్డిపై ప్రశంసలు..

అనంతరం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు పాలమూరుకు చెడ్డపేరుండేదని.. వలసల జిల్లాగా పిలిచేవాళ్లున్నారు. నేడు జిల్లాలో పూర్తిస్థాయి రూపురేఖలు మారాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనలాంటి స్నేహితుడు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనంతరం కలెక్టరేట్ పక్కనే ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెరాస భారీగా జనసమీకరణ చేపట్టింది. వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల, అలంపూర్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారు. సుమారు లక్షా 20వేల మందిని సభకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గతంలోనే ప్రారంభించాల్సి ఉండగా.. రెండుసార్లు రద్దయ్యాయి.

ఇదీ చూడండి:

Last Updated :Mar 8, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.