అయ్యయ్యో.. టీకా వద్దమ్మా.. ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్న కుటుంబం!

author img

By

Published : Dec 21, 2021, 11:00 AM IST

Strange experience to Health staff Palakaveedu, vaccination problems

Strange experience to Health staff Palakaveedu : సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఇంటింటికీ కరోనా టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందికి ఓ వింత అనుభవం ఎదురైంది. టీకా వేయడానికి ఓ ఇంటికి వెళ్లగా... ఆ ఇంటి సభ్యులంతా లోపలకు వెళ్లి.. తలుపులు మూసేసుకున్నారు. వారిని బయటకు రప్పించడానికి అధికారులు, సిబ్బంది ఆ ఇంటి ముందు బైఠాయించారు. అయినా ఎంతకీ తలుపులు తీయలేదు.

Strange experience to Health staff Palakaveedu : కొవిడ్‌ టీకాల పంపిణీలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న ఆరోగ్య సిబ్బందికి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. గ్రామానికి చెందిన కొండా చిన అచ్చయ్య(65) ఇంటికి సోమవారం ఆరోగ్య సిబ్బంది వెళ్లారు. టీకా వేసుకోబోనని తేల్చిచెప్పిన ఆ ఇంటి సభ్యులు.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎంపీడీవో జానయ్య, ఎంపీవో దయాకర్‌లు నచ్చజెప్పినా ఆయన లక్ష్యపెట్టకపోవడం, తలుపులు తీయకపోవడంతో ఇంటి ఎదుటే బైఠాయించారు. 40 నిమిషాలపాటు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో వారంతా వెనుదిరిగారు.

అక్కడక్కడా ఇదే పరిస్థితి..

vaccination problems : కరోనాను కట్టడి చేయడానికి దేశంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో అర్బన్, రూరల్ ఏరియాల్లో వ్యాక్సినేషన్ యాక్టివ్​గా కొనసాగుతోంది. ఇందులో భాగంగా వైద్యసిబ్బందికి కొన్ని వింత వింత అనుభవాలు సైతం ఎదురవుతున్నాయి. టీకా వేసుకోవడానికి కొందరు ససేమిరా అంటున్నారు. వారిని ఒప్పించడానికి వైద్య సిబ్బంది, అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వారి ప్రయత్నాలు కొన్ని చోట్ల సఫలం కాగా... మరికొన్ని ఇలా వెనుదిరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

దండం పెడతా సార్.. టీకా వద్దు..

old woman rejected covid vaccine : కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఏకైక మార్గమని వైద్యాధికారులు చెబుతుంటే.. ఓ వృద్ధురాలు మాత్రం టీకా వద్దని ఇటీవల నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. బొర్రవ్వ అనే వృద్ధురాలు కరోనా వాక్సిన్ వేసుకోకపోవడంతో ఏఎన్ఎంలు ఆమె ఇంటికి వెళ్లారు. టీకా తీసుకుంటే కొవిడ్​ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. కానీ ఆ వృద్ధురాలు తాను టీకా వేసుకోనని తెగేసి చెప్పింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాక్సిన్ వేసుకోవడానికి ఆ వృద్ధురాలు ముందుకు రాలేదు. సుమారు రెండు గంటలపాటు ఆ వృద్ధురాలితో మాట్లాడినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఇంట్లో ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉంటాను.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏం జరుగుతుందో అని ఆమె భయపడింది. ఇంటికి వచ్చిన వైద్యాధికారులు వెళ్లాలని.. కాళ్లు మొక్కి వేడుకుంది. ఎంతకీ వినకపోవడం వల్ల సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు. టీకా వేసేందుకు వైద్య సిబ్బందికి పలుచోట్ల ఇలాంటి ఘటనలు ఎదురవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

టీకా వద్దని ఇంటి పైకి ఎక్కాడు..

కరోనా టీకా భయంతో ఓ వృద్ధుడు ఇంటిపైకి ఎక్కాడు. ఈ ఘటన కర్ణాటక దావణగెరె జిల్లాలోని హదాడి గ్రామంలో జరిగింది. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కొవిడ్​-19 వ్యాక్సిన్ వేశారు. ఈ క్రమంలో.. అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప(77) కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించాడు. వ్యాక్సిన్​ వద్దంటూ ఇంటిపైకి ఎక్కి కూర్చున్నాడు. ఎలాగోలా హనుమంతప్పకు నచ్చజెప్పి టీకావేసి వెళ్లిపోయారు. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: Corona Vaccine to Old Woman : వ్యాక్సిన్ తీసుకోగానే మహిళకు పూనకం.. షాక్​లో వైద్యసిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.