Kishan Reddy: 'కుర్చీ, కుమారుడు, కుటుంబం కోసం కేసీఆర్​ ఏమైనా చేస్తారు'

author img

By

Published : Aug 19, 2021, 8:24 PM IST

Updated : Aug 19, 2021, 10:54 PM IST

Kishan Reddy

కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రజలను కోరారు. గతంలో వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు.. ఇతర దేశాలపై ఆధారపడ్డారని.. ప్రధాని మోదీ అధికారం చేపట్టాక.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనాకు స్వదేశంగా టీకా తయారైనట్లు చెప్పారు. ఉపఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్​ ఏమైనా చేస్తారని.. హుజారాబాద్​లో ఎన్నో కుట్రలు, జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. మా కుటుంబమే ఉండాలి అనే ధోరణిలో కేసీఆర్​ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కరోనా వెలుగుచూసిన తొలినాళ్లలో.. భారతదేశంలోకి ఈ వైరస్ వస్తే అడ్డుకోలేరని, అక్కడ ప్రజలు కొవిడ్​ ప్రోటోకాల్స్​ పాటించరని.. ఇతర దేశాలు అపోహలు పడ్డాయని.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. కానీ ప్రధాని నేతృత్వంలో కఠిన ఆంక్షలు విధించి కరోనాను కట్టడిచేసినట్లు స్పష్టంచేశారు. జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా.. సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటుచేసిన సభలో కిషన్​రెడ్డి పాల్గొన్నారు.

గతంలో టీకాలు, ఇతర వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి వచ్చేవని.. కానీ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా కట్టడికి స్వదేశంగా టీకా తయారైనట్లు తెలిపారు. ప్రపంచంలో తొలుత టీకాలు తయారుచేసిన కొన్ని దేశాల్లో మన దేశం కూడా ఉందన్నారు. స్వయంగా ప్రధానే.. కంపెనీలకు వెళ్లి సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు.

కరోనా విజృంభణ దృష్ట్యా దేశంలోని సుమారు 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఎన్నో ప్రయోజనాలు సమకూర్చినట్లు చెప్పారు. యూరియా కొరత లేకుండా చూసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్​ ఇంకా కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగితే.. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వస్తుందని కిషన్​రెడ్డి విమర్శించారు. కుర్చీ, కుమారుడు, కుటుంబం కోసం ఏమైనా చేసేందుకు తెలంగాణ ఏమైనా పర్వాలేదని.. కేసీఆర్​ అనుకుంటున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు.

ఉపఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్​ ఏమైనా చేస్తారని.. కిషన్​రెడ్డి ఆరోపించారు. వందల కోట్లు ఖర్చుచేసినా.. ప్రజలు భాజపాకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్​లో ఎన్నో కుట్రలు, జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. మా కుటుంబమే ఉండాలి అనే ధోరణిలో కేసీఆర్​ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

'తెలంగాణను ఆదుకొనేందుకు కేంద్రం అనేక విధాలుగా ముందుకువచ్చింది. కానీ సచివాలయానికి రాకుండా.. ప్రగతిభవన్​కు మాత్రమే పరిమితమై.. కేంద్రం మీద కేసీఆర్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని రోజులు కేసీఆర్​ ముఖ్యమంత్రిగా కొనసాగితే.. రాష్ట్రం దివాలా తీస్తుంది. కుర్చీ, కుమారుడు, కుటుంబం కోసం.. తెలంగాణ ఏమైనా పోయినా పర్వాలేదు.. మాకు అధికారం ఉండాలని అనేవిధంగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​, భాజపాను ఓడించేందుకు.. కేసీఆర్​ ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు.'

- జి. కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

Kishan Reddy: 'కుర్చీ, కుమారుడు, కుటుంబం కోసం కేసీఆర్​ ఏమైనా చేస్తారు'

ఇదీచూడండి: Bandi Sanjay: 'టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని... మామూలు కార్యకర్త కేంద్రమంత్రి'

Last Updated :Aug 19, 2021, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.