Mallanna Sagar reservoir : మల్లన్న సాగర్​కు నీటి పంపింగ్ నిలిపివేసిన అధికారులు

author img

By

Published : Oct 3, 2021, 10:34 AM IST

మల్లన్న సాగర్​

సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్​ జలాశయాని(Mallanna Sagar reservoir)కి అధికారులు నీటి పంపింగ్​ను నిలిపివేశారు. పంపింగ్ ద్వారా ప్రాజెక్టులో 11 టీఎంసీల నీరు చేరగా.. ఇటీవల కురిసిన వర్షాలకు మరో టీఎంసీ నీళ్లు చేరి ప్రస్తుతం 12 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(Kaleshwaram lift irrigation)లో భాగంగా నిర్మించిన జలాశయాల్లో అతిపెద్దదైన మల్లన్న సాగర్​ రిజర్వాయర్​(Mallanna Sagar reservoir)లోనికి నీటి పంపింగ్​ను అధికారులు నిలిపివేశారు. ఈ జలాశయ(Mallanna Sagar reservoir) కీలక పనులు పూర్తి చేసిన అధికారులు ఆగస్టు 22 నుంచి 28 వరకు ప్రయోగాత్మకంగా జలాశయం(Mallanna Sagar reservoir)లోకి గోదావరి నీటిని పంపింగ్ చేశారు. ఈ ఏడు రోజుల్లో 4.3 టీఎంసీల నీటిని నింపారు.

తిరిగి సెప్టెంబర్ 17 నుంచి రెండో విడత పంపింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు జలాశయం(Mallanna Sagar reservoir)లో 11 టీఎంసీల నీరు పంపింగ్ చేయగా.. ప్రాజెక్టు పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలతో మరో టీఎంసీ నీరు జలాశయంలోకి చేరింది. ప్రస్తుతం మల్లన్నసాగర్​(Mallanna Sagar reservoir)లో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మల్లన్న సాగర్(Mallanna Sagar reservoir) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(Kaleshwaram lift irrigation)లో అతిపెద్ద జలాశయంగా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.