Harish Rao: పాదయాత్ర ఎందుకో ప్రజలకు చెప్పాలి: హరీశ్​ రావు

author img

By

Published : Sep 12, 2021, 3:43 PM IST

harish rao

భాజపా నేతలు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ సిలిండర్ల ధర పెంచిందని తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక అనుబంధ గ్రామమైన అంకంపేట గ్రామంలో 43 రెండు పడకల ఇళ్ల సామూహిక నూతన గృహా ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సిద్దిపేట రూరల్ మండలంలోని సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామమైన అంకంపేట గ్రామంలో 43 రెండు పడకల ఇళ్ల సామూహిక నూతన గృహా ప్రవేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. నూతనంగా నిర్మించనున్న మరో 21 డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు భూమి పూజ చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అంకంపేట, సీతారాంపల్లి, శంకర్​నగర్, ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చాలా బాగా నిర్మించామని హరీశ్​ రావు అన్నారు. చింతమడక, అంకంపేటలో నూతనంగా ప్రాథమిక పాఠశాల, అంగన్​వాడీ పాఠశాల, వీధి దీపాలు, బీటీ రోడ్లు త్వరలో నిర్మిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్​ను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నారు.

కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనుగోళ్లు చేయడం లేదని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంతో ప్రజలపై భారం పడిందని చెప్పారు. భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందన్నారు. మెదక్ జిల్లాలో పాదయాత్ర చేసే వారు.. రైతలు, జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు పాదయాత్ర చేయాలన్నారు. డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని ఆరోపించారు.

కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్​ ధర పెరిగింది. పోయిన వానకాలం ఒక ట్రాక్టర్​ ఎకరా పొలాన్ని 3 వేల రూపాయలకు దున్నేవారు. ఈ వానకాలం ఎకరాకు రూ. 6వేలకు పెరిగింది. 56 రూపాయిలు ఉన్న జీజిల్​ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.100లకు పెంచింది. పెట్రోల్​ ధర పెంచారు. గ్యాస్​ సిలిండర్​ వెయ్యి రూపాయలు చేశారు. భాజపా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది.

-హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి: హరీశ్​ రావు

ఇదీ చదవండి: KTR: ఒకే చోట 15,660 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. అద్భుత దృశ్యం: కేటీఆర్‌ ట్వీట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.