'డ్రాగన్​ఫ్రూట్​ సాగుతో యువరైతు అద్భుతాలు'

author img

By

Published : Mar 3, 2020, 6:10 AM IST

Dragon_Fruit

వృత్తిపరంగా వైద్యుడైనప్పటికీ... వ్యవసాయంపై మక్కువతో కర్షకునిగా మారాడు. సాగులో ఆశ్చర్యకర ఫలితాలను సాధిస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ డ్రాగన్ ప్రూట్​ దిగుబడి సాధించి పరిశోధకులనే ఔరా అనిపిస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన ఆ యువరైతు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ కథనం చదవాల్సిందే...

మనదేశంలో సాగుచేయలేమన్న డ్రాగన్​ఫ్రూట్​ను పండించి వ్యవసాయ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యానికి గురి చేశాడు కూకట్​పల్లికి చెందిన యువ వైద్యుడు శ్రీనివాస్ రావు. 2015లో తొలిసారి డ్రాగన్​ప్రూట్​ చూసి... ఆ పండు గురించి అంతర్జాలంలో శోధించి... దాని పౌష్టిక విలువలు, ఔషధ గుణాలు తెలుసుకున్నాడు.

పట్టువదలని విక్రమార్కుడిలా శోధన...

ఈ ఫ్రూట్​ హవాయి, వియత్నాం, దక్షిణాఫ్రికాలో పెరుగుతుందని... మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో సాగవుతున్నట్లు శ్రీనివాస్​రావు తెలుసుకున్నారు. మహారాష్ట్ర మొక్కలతో సంగారెడ్డి సమీపంలోని తన భూమిలో సాగు చేసినా ప్రయోజనం కలగలేదు. నిరాశ చెందకుండా విదేశాల్లో పర్యటించి డ్రాగన్​ఫ్రూట్​ ​సాగు విధానాలను నేర్చుకున్నారు.

ప్రతికూల వాతావరణంలోనూ పండించేందుకు ప్రయోగాలు...

వియత్నాం నుంచి విత్తనాలు తెచ్చి 2017లో తిరిగి సాగు ప్రారంభించారు. మేలైన పద్ధతులతో 8 నెలల్లోనే దిగుబడి పొందారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పండే డ్రాగన్​ఫ్రూట్​ను ప్రతికూల వాతావరణంలోనూ పండించేందుకు ప్రయోగాలు చేసి విజయం సాధించారు.

సీజన్​లో రూ.150... ప్రస్తుతం రూ.400...

ఏడాదిలో 365రోజులు డ్రాగన్​ప్రూట్ పండేలా సాంకేతికత అభివృద్ధి చేశారు. ప్రతికూల వాతావరణం​లోనూ పూర్తిస్థాయి దిగుబడి వస్తుందని... పండు పరిమాణం, రుచి సాధారణం కంటే ఎక్కువ ఉందని శ్రీనివాస్ రావు తెలిపారు. సీజన్​లో కిలో రూ. 150 ఉండగా... ప్రస్తుతం రూ. 400 లకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.

"అసలు డ్రాగన్ ఫ్రూట్ పండదు అన్న చోట తాను.. 365రోజులు పండించగలుగుతున్నానని శ్రీనివాస్ రావు ధీమాగా చెబుతున్నారు."

'డ్రాగన్​ఫ్రూట్​ సాగుతో యువరైతు అద్భుతాలు'

ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్​: బంగారం అమ్మేస్తున్నారు.. విమానాలకు గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.