ఆరోగ్య పరీక్షలకు వెళ్తున్న గర్భిణి కారును అరగంట ఆపిన పోలీసులు.. ఎందుకంటే?

author img

By

Published : Sep 28, 2021, 11:00 PM IST

police stopped pregnant women vehicle

ఆరోగ్య పరీక్షలకు వెళ్తున్న గర్భిణి కారును వాహన తనిఖీల (police stopped pregnant women vehicle) సందర్భంగా పోలీసులు నిలిపేశారు. కారుపై ఉన్న పెండింగ్​ చలానాలు చెల్లిస్తేనే వెళ్లనిస్తామని పోలీసులు చెప్పారని.. కారు డ్రైవర్​ తెలిపారు. ఇలా సుమారు అరగంట పాటు గర్భిణి కారును నిలిపేశారు సంగారెడ్డి జిల్లా పోలీసులు.

హెల్త్​ చెకప్​ కోసం ఆస్పత్రికి వెళ్తున్న నిండు గర్భిణి వాహనాన్ని (police stopped pregnant women vehicle)నిలిపేసిన పోలీసులు ఆమెను అవస్థలకు గురిచేశారు. ఈ ఘటన మెదక్​ జిల్లా అల్లాదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకొంది.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​కు చెందిన గర్భిణి శిల్ప.. కుటుంబ సభ్యులతో కలిసి మెదక్​ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కారులో బయలుదేరారు. నాందేడ్​ అకొల జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్న అల్లాదుర్గం పోలీసులు వారి కారును ఆపారు. సదరు వాహనంపైన రూ.2700 పెండింగ్​ చలానాలు ఉన్నాయని.. వాటిని చెల్లించి వెళ్లాలని స్పష్టం చేశారు. కారులో గర్భిణి ఉందని.. హెల్త్​ చెకప్​ కోసం వెళ్తున్నామని పోలీసులకు చెప్పినట్లు బాధితులు చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద చలానా చెల్లించేందుకు సరిపడా నగదు లేవని చెప్పినా వినలేదని... ఇంటికి వెళ్లాక ఆన్​లైన్​ చెల్లింపులు చేస్తామన్నా... పోలీసులు వినిపించుకోలేదని కారు డ్రైవర్​ తెలిపాడు. సుమారు అరగంటకు పైగా కారును ఆపారన్నారు. ఈ సమయంలో గర్భిణి ఇబ్బంది పడ్డారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు ఉన్నతాధికారులకు ఫోన్​ చేసి చెప్పాక.. పోలీసులు విడిచిపెట్టారని గర్భిణి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఆరోగ్య పరీక్షలకు వెళ్తున్న గర్భిణి కారును నిలిపేసిన పోలీసులు.. ఎందుకంటే?

'నారాయణఖేడ్​ నుంచి మెదక్​ ఆస్పత్రికి వెళ్తున్నాం. మార్గమధ్యలో పెండింగ్​ చలానాలు ఉన్నాయని చెప్పి పోలీసులు ఆపారు. ఎమర్జెన్సీ అని చెప్పాం.. రెండు చలానాలు ఉన్నాయి... ఇంటికెళ్లాక ఆన్​లైన్​ చెల్లింపులు చేస్తామన్నం. అయినా పోలీసులు వినలేదు.'

- కారు డ్రైవర్​

ఇదీచూడండి: Manikonda Manhole Incident: రజినీకాంత్​ కుటుంబానికి ప్రభుత్వ పరిహారం.. బాధ్యులపై చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.