జీపీలో డబ్బులు పంచుతూ సీసీ కెమెరాలకు చిక్కిన సర్పంచ్

author img

By

Published : Aug 25, 2021, 12:03 PM IST

KRISHNAREDDYPETA SARPANCH DISTRIBUTED MONEY TO WARD MEMBERS AND DEPUTY SARPANCH

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం కిష్ణారెడ్డి పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో... డబ్బు పంచుకుంటున్న వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరూ భవన నిర్మాణదారులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం కిష్ణారెడ్డి పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో... సర్పంచ్ క్రిష్ణ, పాలకవర్గం సభ్యులు డబ్బులు పంచుకుంటున్న వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. ముందుగా ఓ వ్యక్తి డబ్బుల సంచి తీసుకొని జీపీ కార్యాలయంలోకి రాగానే... లోపలున్న మరో వ్యక్తి తలుపులు వేయడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అనంతరం సర్పంచ్ క్రిష్ణ డబ్బుల సంచిని తెరిచి... నోట్ల కట్టలను ఉప సర్పంచ్​కి ఇచ్చాడు. అతను వాటిని లోపలున్న పాలకవర్గ సభ్యలందరికీ సమానంగా పంచాడు. ఈ సన్నివేషాలన్నీ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

కిష్ణారెడ్డి పేట గ్రామ పంచాయతీలో అక్రమాలు పెరిగిపోయాయని.. భవన నిర్మాణ దారులను బెదిరించి సర్పంచి, ఉప సర్పంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వార్డు సభ్యుడు అశోక్ ఆరోపిస్తున్నాడు. గ్రామపంచాయతీ పాలకవర్గం అక్రమాలు తెలుసుకున్న జిల్లా పాలనాధికారి హనుమంతరావు కొద్దిరోజుల క్రితం సర్పంచ్, ఉప సర్పంచ్​లను ఆరు నెలల పాటు సస్పెండ్​ చేసినట్లు అశోక్ తెలిపారు. కానీ 40 రోజులు కూడా పూర్తికాక ముందే సర్పంచ్, ఉపసర్పంచ్ పదవిలో కొనసాగేలా ఎలా చర్యలు తీసుకున్నారని కలెక్టర్​ను ప్రశ్నించారు. తాజా ఘటనపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించాలని... అశోక్ డిమాండ్ చేశారు.

జీపీలో డబ్బులు పంచుతూ సీసీ కెమెరాలకు చిక్కిన సర్పంచ్

ఇదీ చూడండి: CYBER CRIME: పోలీసులు కౌన్సిలింగ్​ ఇచ్చినా... రూ.5 కోట్లకు ఆశపడి 25లక్షలు పొగొట్టుకుంది!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.