Farmers Protest: జహీరాబాద్​లో చెరకు రైతుల నిరసన.. 5 వేల మందితో బైక్​ ర్యాలీ

author img

By

Published : Sep 22, 2021, 1:49 PM IST

Cane Farmers Protest for open sugar factory in Zaheerabad

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చెరకు రైతులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ద్విచక్రవాహనాలపై 5 వేల మంది చెరకు రైతులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, పరిశ్రమ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జహీరాబాద్‌ బంద్‌కు చెరకు రైతులు ఆందోళన చేపట్టారు. ట్రైడెంట్ చక్కెర కర్మాగారం తెరిపించాలని డిమండ్ చేశారు. రైతుల బంద్‌కు అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు.

చక్కెర కర్మాగారాలు తెరిపించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో చెరకు రైతులు చేపడుతున్న బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు ట్రైడెంట్, పసల్ వాది గణపతి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని చెరకు రైతులు జహీరాబాద్ బంద్​కు పిలుపునిచ్చారు. వారం రోజులుగా బంద్ నిర్వహణపై రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో జహీరాబాద్​లో వ్యాపార వాణిజ్య దుకాణ సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ రైతులకు మద్దతు ప్రకటించారు.

చెరకు రైతుల బందుకు కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీలు సైతం మద్దతు ప్రకటించి ప్రదర్శనలో పాల్గొన్నారు. పట్టణంలో రైతులు పెద్దఎత్తున్న నిరసన ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ద్విచక్రవాహనాలపై 5 వేల మంది చెరకు రైతుల ర్యాలీగా తరలివచ్చి బంద్​లో పాల్గొన్నారు. ప్రభుత్వ, పరిశ్రమ నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ.. ఆందోళన నిర్వహించారు. చక్కెర కర్మాగారాలు తెరిపించాలని డిమాండ్ చేశారు.

జహీరాబాద్​లో చెరకు రైతుల నిరసన.. 5 వేల మందితో బైక్​ ర్యాలీ

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.