Lb nagar Ganesh Immersion: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోన్న నిమజ్జనం

author img

By

Published : Sep 19, 2021, 8:59 PM IST

Ongoing ganesh immersion

రంగారెడ్డి జిల్లాలో గణనాథుల నిమజ్జనం వైభవంగా (Lb nagar Ganesh Immersion) సాగుతోంది. ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్​మెట్​ పరిధిలో నిమజ్జనం కొనసాగుతోంది.

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్​మెట్ పరిధిలో గణేశ్​ నిమజ్జనం (Lb nagar Ganesh Immersion) కొనసాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడిని డప్పు చప్పుళ్లు, డీజేలకు స్టెప్పులు వేస్తూ సంతోషంతో నిమజ్జనానికి సాగనంపుతున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం పరిధిలోని గణపతులను సరూర్​నగర్ చెరువులకు తరలించగా.. హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్ పరిధిలోని వినాయకులను ఇనాంగూడా చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. వర్షంలో సైతం నిమజ్జనం కొనసాగించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.