'వచ్చే ఆరేడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పారిస్తాం'

author img

By

Published : May 11, 2022, 8:43 PM IST

'వచ్చే ఆరేడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పారిస్తాం'

Harish Rao Comments: వచ్చే ఆరేడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పారిస్తామని మంత్రి హరీశ్​ అన్నారు. ఈ ఏడాదిలోనే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో 100 పడకల ఆసుపత్రి కోసం మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. 21 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ఆసుపత్రిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Harish Rao Comments: రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో 100 పడకల ఆసుపత్రి కోసం మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. 21 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ఆసుపత్రిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెరాస లేకపోతే తెలంగాణ వచ్చేదా అని మంత్రి హరీశ్​ ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే వారికి బండి సంజయ్​కు అధ్యక్ష పదవి వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. అధికారం కోసమే కాంగ్రెస్​, భాజపా నేతలు ఆరాటపడుతున్నారని.. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కాదని ఆయన విమర్శించారు.

రాయచూర్​ ఎమ్మెల్యే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్​ లాంటి పథకాలను తమ నియోజకవర్గంలో అమలు చేయాలని డిమాండ్​ చేశారని... లేకుంటే నియోజకవర్గాన్ని తెలంగాణలో కలిపేస్తామని హెచ్చరించారన్నారు. తెలంగాణ రాక ముందు తలసరి ఆదాయం లక్షా 24 వేల రూపాయలు ఉండేదని.. ఏడేండ్లలో కేసీఆర్​ నాయకత్వంలో 2లక్షల 78వేల రూపాయలతో దేశంలో నంబర్​ వన్​ స్థానంలో ఉందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. దక్షిణ భారత్​లో 7 రాష్ట్రాల కంటే జీఎస్​డీపీలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ మొదటి స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. ఈ దేశంలో రైతులకు ఉచిత విద్యుత్​ ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్​ పాదయాత్ర చేస్తూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని ప్రశంసించారని వెల్లడించారు.

వచ్చే ఆరేడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పారిస్తామని మంత్రి హరీశ్​ అన్నారు. ఈ ఏడాదిలోనే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రేపో మాపో లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును కూడా తీసుకొస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్​, భాజపా నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. డిక్లరేషన్​ల పేరిట కాంగ్రెస్​ నేతలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ పార్టీనే అధికారంలో ఉందని.. అక్కడ ఎందుకు అభివృద్ధి జరగడం లేదని మంత్రి హరీశ్​ ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.