Vemulawada Rajanna Temple: దేవీ నవరాత్రి ఉత్సవాలకు రాజన్న ఆలయం ముస్తాబు

author img

By

Published : Oct 6, 2021, 5:18 PM IST

Vemulawada

దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ముస్తాబైంది. అమ్మవారికి నవరాత్రుల పూజల సందర్భంగా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల పనులు చేపట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం(Vemulawada Rajanna Temple)లో బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాల (Devi Navaratri Festival) సందర్భంగా ఆలయాన్ని అధికారులు ముస్తాబు చేశారు. అమ్మవారికి నవరాత్రుల పూజ నిమిత్తం మండపాన్ని సైతం ఏర్పాటు చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి వచ్చే శుక్రవారం వరకు ఘనంగా నిర్వహించనున్నారు.

మొదటిరోజుగురువారము శైలపుత్రి అలంకారము హంసవాహనం
రెండవరోజుశుక్రవారము బ్రహ్మచారిణి అలంకారము నెమలి వాహనం
మూడవ రోజుశనివారము చంద్రఘంట అలంకారము
నాల్గవ రోజుఆదివారముకూష్మాండ అలంకారము
ఐదవ రోజుసోమవారము స్కందమాత అలంకారము
ఆరో రోజుమంగళవారముకాత్యాయని అలంకారము
ఏడో రోజుబుధవారము (దుర్గాష్టమి) కాళరాత్రి అలంకారము నెమలి వాహనం
ఎనిమిదో రోజు గురువారముమహాగౌరీ అలంకారము ధర్మగుండం నందు తెప్పోత్సవము
తొమ్మిదో రోజు శుక్రవారము (విజయదశమి) దసరా సిద్ధిదా (శ్రీ మహాలక్ష్మి) శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారము గజవాహనములపై అంబారీ సేవ

ఈ మేరకు ఆలయాధికారులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Good Relationship tips: అతి చనువు వద్దు.. అలాగని మాట్లాడకుండా ఉండొద్దు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.