ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని మండిపడ్డ శ్రీధర్ బాబు

author img

By

Published : Aug 29, 2022, 7:32 PM IST

శ్రీధర్ బాబు

MLA Sridhar Babu House Arrest పెద్దపల్లి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేయడాన్ని మంథని ​ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను గృహ నిర్భంధం చేశారు. తనను నిర్భంధం చేయడం పట్ల ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని పోలీసుల తీరుపై శ్రీధర్ బాబు మండిపడ్డారు.

MLA Sridhar Babu House Arrest: పెద్దపల్లి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేయడాన్ని మంథని ​ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను గృహ నిర్భంధం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరించాలని కోరుతుంటే.. మరోవైపు పోలీసులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు ప్రశ్నించారు.

ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేయాలని అనుకున్న తనను పోలీసులు అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. గత కొంత కాలంగా రామగుండం ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.

తద్వారా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. మంథని ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్​లో లిఫ్ట్​ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సాగు నీరు అందించాలని అన్నారు. పోలీసుల తీరు వల్ల ఆ సమస్యలకు పరిష్కారం కాకుండా పోయాయని కనీసం.. ఈ వినతి పత్రాలను పోలీసులు సీఎంకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

"ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మిడ్​ మానేరు ముంపు బాధితులకు సంబంధించిన పెండింగ్​లో ఉన్న సమస్యలపై కాంగ్రెస్ నేతలను పోరాటం చేస్తే వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. వీటన్నింటిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా నన్ను పోలీసులు ఆపారు. ప్రధానంగా ఆర్​ఎఫ్​సీఎల్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." -శ్రీధర్ బాబు,మంథని ​ఎమ్మెల్యే

అసలేం జరిగిదంటే: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు మంథని రోడ్డులో నిర్మించనున్న తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉందన్న సమాచారంతో.. పోలీసులు ముందుగా జాగ్రత్త చర్యగా హస్తం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన ముగిసిన తరువాత వారిని విడిచిపెట్టారు. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చే అవకాశం లేకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని హౌస్ అరెస్ట్ అయిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మండిపడ్డారు.

ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని మండిపడ్డ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ఇవీ చదవండి: పెద్దపల్లి కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

భాజపా ముక్త్ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలని కేసీఆర్‌ పిలుపు

కాంగ్రెస్​కు డాక్టర్​ బదులు కాంపౌండర్ల వైద్యం, ఏ క్షణమైనా పార్టీ శిథిలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.