108 STAFF: ఆగి పోయిన పసి గుండెను.. మళ్లీ బతికించారు

author img

By

Published : Jul 28, 2021, 11:44 AM IST

108 STAFF

పరిస్థితి విషయమై ఆస్పత్రికి వెళ్తుండగా.. దారి మధ్యలో ఓ పసి హృదయం ఆగిపోయింది. అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది.. పీసీఆర్​ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేసి.. ఆ బిడ్డకు ప్రాణం పోశారు.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. పుట్టినప్పటి నుంచి బాబు ఆరోగ్యం సరిగా లేదు. దీంతో కరీంనగర్​సివిల్​ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో వరంగల్​ ఎంజీఎంకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.

అక్కడి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో చెంజర్ల మండలం ఖాదర్​ గూడెం వద్ద బాబు గుండె ఆగిపోయింది. వెంటనే 108 సిబ్బంది వెంకట్ అప్రమత్తమయ్యారు.​ పీసీఆర్​ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేసి ప్రాణం పోశాడు.

సివిల్​ ఆస్పత్రిలో బాబుకు చికిత్స అందిస్తూ ఉండగా.. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్​ ఎంజీఎంకు తీసుకెళ్లాలని ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి వెంటనే బయలుదేరాము. దారిలో బాబుకు హృదయ స్పందన ఆగిపోయింది. అప్పటికప్పుడు 108 వైద్య సిబ్బందితో మాట్లాడి పీసీఆర్​ చేశాము. మళ్లీ గుండె కొట్టుకుంది. అవసరమైన చికిత్స అందించి వెంటనే ఎంజీఎంకు తీసుకెళ్లాము.

-వెంకట్, 108 సిబ్బంది

అనంతరం వరంగల్​ ఎంజీఎంకు తీసుకెళ్లారు. తమ కుమారుడు 108 సిబ్బంది వల్లే బతికాడని.. శిశువు తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బాబు చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

అంబులెన్స్​ సిబ్బంది

ఇదీ చూడండి: Mother Story: బిడ్డ మనసును.. అమ్మకాక మరెవరు అర్థం చేసుకుంటారు!


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.