డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లపై పేదలు ఆశలు వదులుకోవాల్సిందే: ఎంపీ అర్వింద్

author img

By

Published : Jan 13, 2023, 5:32 PM IST

MP Dharmapuri Arvind

MP Arvind Comments on Double Bedroom Houses : పేదలు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లపై ఆశలు వదులుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అది కేవలం కేసీఆర్ మాయ అని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

MP Arvind Comments on Double Bedroom Houses : డబుల్​ బెడ్​రూమ్ ఇళ్ల విషయంలో కేసీఆర్​ మాయమాటలు చెబుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5-6 లక్షలు ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు. నిజమాబాద్​ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. డబుల్​ బెడ్​ రూమ్ పథకం కోసం బడ్జెట్​లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు.

2020-21లో రూ.10 వేల కోట్లు బడ్జెట్​లో పెట్టి ఇళ్లపై రూపాయి ఖర్చు చెయ్యలేదని ఆరోపించిన ఆయన.. నిధులు ఎక్కడికి వెళ్లిపోయాయని ప్రశ్నించారు. 2021-2022లో రూ.10,875 కోట్లు కేటయించామని చెప్పి చివరకు రూ.4800 కోట్లకు కుదించి రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదని మండిపడ్డారు. గత బడ్జెట్​లోనూ రూ.12 వేల కోట్లు సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. అసలు ప్రభుత్వం డబ్బులే కేటాయించనప్పుడు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా పేదలు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లపై ఆశలు వదులుకోవాలని అర్వింద్ సూచించారు.

"డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై పేద ప్రజలు ఆశలు వదులుకోవాలి. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5-6 లక్షలు ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామంటున్నారు. 2020-21లో రూ.10 వేల కోట్లు బడ్జెట్​లో పెట్టి ఇళ్లపై రూపాయి ఖర్చు చెయ్యలేదు. 2021-2022లో రూ.10,875 కోట్లు కేటయించామని చెప్పి.. చివరకు రూ.4800 కోట్లకు కుదించి రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదు. గత బడ్జెట్​లోనూ రూ.12 వేల కోట్లు సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తామన్నారు".- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

డబుల్ బెడ్ రూం ఇళ్లపై పేదలు ఆశలు వదులుకోవాలి: ఎంపీ అర్వింద్

పేదలకు అందని ద్రాక్షగానే డబుల్ బెడ్​ రూం ఇళ్లు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు పేదలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా.. అర్హుల ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లు 1.18 లక్షలు కాగా.. అందులో లబ్ధిదారులకు 17.7 శాతమే అప్పగించారు. మరికొన్ని చోట్ల పనులు పూర్తయినా ఏడాది నుంచి మూడేళ్లుగా నిరీక్షిస్తున్నవారు ఎందరో ఉన్నారు.

ఉదాహరణకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జీ+3 విధానంలో 544 ఇళ్లు కట్టారు. నిర్మాణం పూర్తయి మూడున్నర ఏళ్లవుతోంది. అర్హుల ఎంపిక మాత్రం పూర్తికాలేదు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతున్నా తీవ్ర జాప్యం అవుతోంది. పలుచోట్ల ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది. ఏడాది మొదలు మూడేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నవారు ఎందరో!

కరీంనగర్ జిల్లాలో: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరేళ్ల క్రితం రెండు పడక గదుల ఇళ్ల పనులు ప్రారంభించారు. నిర్మాణాలు పూర్తై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పంపిణీ చేయలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు దెబ్బతినే స్థాయికి చేరుకున్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక మండలం కోర్కల్‌లో రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.