TU VC vs EC Controversy : రిజిస్ట్రార్​గా కొనసాగే అర్హత అతనికి లేదు: వీసీ రవీందర్

author img

By

Published : May 15, 2023, 4:22 PM IST

Updated : May 15, 2023, 5:56 PM IST

TU VC vs EC

TU VC vs EC Controversy Latest Update : నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి తెలంగాణ యూనివర్సిటీలో మళ్లీ రిజిస్ట్రార్ నియామక విషయంలో వివాదం మొదలైంది. పరిపాలన భవనంలోని రిజిస్ట్రార్​ ఛాంబర్​కు సెక్యూరిటీ తాళం వేశారు. వీసీ ఆచార్య రవీందర్​ సెక్యూరిటీ అధికారికి ఫోన్​ చేసి రిజిస్ట్రార్ గదికి తాళం వేయించినట్లు సమాచారం. అయితే దీనిపై వీసీ రవీందర్ స్పందించారు. రిజిస్ట్రార్​గా కొనసాగే అర్హత యాదగిరికి లేదని తెలిపారు. త్వరలోనే నూతన రిజిస్ట్రార్​ని నియమిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు వీసీపై చర్యలు తీసుకోవాలని స్థానిక బీజేపీ నేతలు గవర్నర్​కు ఫిర్యాదు చేశారు.

TU VC vs EC Controversy Latest Update : నిజామాబాద్​ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ కుర్చీల విషయంలో మళ్లీ వివాదం మొదలైంది. అయితే పరిపాలన భవనంలోని రిజిస్ట్రార్ ఛాంబర్​కు ఉదయమే సెక్యూరిటీ తాళం వేశారు. వీసీ ఆచార్య రవీందర్ గుప్తా సెక్యూరిటీ అధికారికి ఫోన్​ చేసి రిజిస్ట్రార్ గదికి తాళం వేయించినట్లు తెలిసింది. ఉదయమే యూనివర్సిటీకి వచ్చిన వీసీ రవీందర్​.. రిజిస్ట్రార్​ ఛాంబర్​కు తాళం వేయించినట్లు తెలియడంతో పాలక మండలి నియమించిన రిజిస్ట్రార్​ యాదగిరి కామర్స్ కళాశాలలోని డిపార్ట్​మెంట్​లో కూర్చున్నారు.

దీనికి సంబంధించి వీసీ రవీందర్ గుప్తా సర్కులర్ జారీ చేశారు. యూనివర్సిటీలోని అన్ని ఫైళ్లను అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ఫైనాన్స్ ఆఫీసర్ ద్వారా రూట్ చేసి, కౌంటర్ సైన్ చేయాలి అని సంబంధిత యూనివర్సిటీ అధికారులందరికీ తెలంగాణ వర్సిటీ వీసీకి ముందస్తు సమాచారం లేకుండా ఏ ఒక్క ఫైల్‌ను కూడా అనధికార వ్యక్తికి అందజేయరాదని సమాచారం. పైన పేర్కొన్న ఉల్లంఘన వైస్​ ఛాన్సలర్ దృష్టికి వస్తే నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్య ప్రారంభించబడుతుందని వీసీ రవీందర్ గుప్తా సర్కులర్ జారీ చేశారు.

అయితే రిజిస్ట్రార్ గదికి తాళం వేసిన ఘటనపై స్పందించారు. వీసీ రవీందర్ గుప్తా తన ఛాంబర్​లో మీడియాతో మాట్లాడుతూ.. రిజిస్ట్రార్ రూమ్​కి తాళం వేయించలేదని పేర్కొన్నారు. ఒకవేళ తాళం వేస్తే డోర్​కి నోటీసులు అంటించి సీజ్​ చేసే వారిమని వెల్లడించారు. పాలకమండలి నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి దగ్గర ఆర్డర్ కాపీ లేనందున ఆ బాధ్యతలను ఏవో ఖాదర్​కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.

రిజిస్ట్రార్​గా కొనసాగే అర్హత అతనికి లేదు..?: రిజిస్ట్రార్​గా కొనసాగే అర్హత యాదగిరికి లేదని వీసీ స్పష్టం చేశారు. రిజిస్ట్రార్ ఛాంబర్​లో విలువైన డాక్యుమెంట్స్ రిజిస్టర్లు, చెక్కు బుక్కులు మాయమైతాయన్న ఉద్దేశంతో రిజిస్ట్రార్ ఛాంబర్​ను తెరవవద్దని సిబ్బందికి చెప్పాననన్నారు. తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ నియామకం కోసం సీనియర్ ప్రొఫెసర్​గా కొనసాగుతున్న నలుగురి పేర్లు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే నియమిస్తామని వీసీ వెల్లడించారు.

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంన్ఛార్జి దినేష్ కులచారి యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులతో కలసి.. హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో గవర్నర్​కి తెలంగాణ వర్సిటీ ఉప కులపతి అవినీతి, అక్రమాల పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ యూనివర్సిటీ అవినీతికి అండగా మారిందని పేర్కొన్నారు.

TU VC vs EC Controversy News : గత నెల రోజులుగా వీసీపై అనేకమైన ఆరోపణలు, రిజిస్ట్రార్ పదవి గురించి జరుగుతున్న రాద్ధాంతం చూస్తూ.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరం అన్నారు. అమాయకులైన గిరిజనుల నుంచి వేల కొద్ది డబ్బులు తీసుకొని తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పిస్తానని బీసీ వారిని మోసం చేశాడని, ఆయనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమ రాజకీయాల కోసం విద్యార్థులతో ఆటలాడొద్దని.. దీనిపై గవర్నర్ ప్రత్యేక చొరవ చూపాలని ఫిర్యాదులో తెలిపినట్లు దినేష్ కులచారి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :May 15, 2023, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.