బాసర ఆర్జీయూకేటీ వద్ద ఉద్రిక్తత, బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Aug 25, 2022, 12:53 PM IST

బాసర ఆర్జీయూకేటీ

Basara RGUKT బాసర ఆర్జీయూకేటీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సురేశ్​ రాఠోడ్ మృతిపై పూర్తి విచారణ జరపాలని కోరుతూ బీజేవైఎం కార్యకర్తలు క్యాంపస్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుంది.

Basara RGUKT: బాసర ఆర్జీయూకేటీ వద్ద స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి సురేశ్​ రాఠోడ్ మృతిపై పూర్తి విచారణ జరపాలని కోరుతూ బీజేవైఎం కార్యకర్తలు క్యాంపస్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వారు నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలలోని విద్యార్థులతో ఆడుకుంటుందని వారు విమర్శించారు. ఆర్జీయూకేటీలో ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని బీజేవైఎం కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులను తోసుకుని ప్రాంగణంలోకి వెళ్లేందుకు యత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్​స్టేషన్​కు తరలించారు.

అసలేం జరిగిదంటే.. ఆర్జీయూకేటీలో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండాకు చెందిన సురేశ్​ రాఠోడ్ విద్యాలయంలో ఈ1 ఇంజనీర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో వసతి గృహంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం మిత్రులు గదికి వెళ్లేసరికి లోపలి నుంచి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి చూడటంతో విద్యార్థి సురేష్ ఉరివేసుకొని ఉన్నాడు.

వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.