అన్నదాతను నిండా ముంచేసిన వరదలు.. కోలుకునేనా..!

author img

By

Published : Jul 19, 2022, 7:37 PM IST

అన్నదాతను నిండా ముంచేసిన వరదలు.. కోలుకునేనా..!

కుండపోత వానలతో నదులు, వాగులు పొంగిపొర్లి.. రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో వానాకాలం సాగుకు సిద్ధమైన అన్నదాతను.. వరదలు నిండా ముంచాయి. ఆదిలాబాద్​ జిల్లాలో ఎన్నడూలేని విధంగా లక్షా 3 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. చేలల్లో భారీగా వరద నీరు చేరి ఎక్కడికక్కడే కోతకు గురికావడంతో మరో పంటవేసే అవకాశం కనిపించడం లేదు.

భారీ వర్షాలు, వరదలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరద ఉద్ధృతితో కోతకు గురైన భూములు, ఇసుక మేటతో పొలాలన్నీ నామరూపాలు లేకుండా దర్శనమిస్తున్నాయి. దాదాపుగా వర్షాధారంపైనే ఆధారపడే ఆదిలాబాద్​ జిల్లా రైతుల ఆశలను వరదలు ముంచేశాయి. పెన్​గంగా, పెద్దవాగు నదుల పరివాహక ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, జైనథ్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ, బోథ్, బజార్​హత్నూర్, గుడిహత్నూర్​ మండలాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. మొలక దశలో ఉన్న పత్తి, సోయా, ఇతర పంటలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి.

అన్నదాతను నిండా ముంచేసిన వరదలు.. కోలుకునేనా..!

ఉట్నూర్ ఏజెన్సీలోని ఆదిలాబాద్​ గ్రామీణం, ఇంద్రవెల్లి, నార్నూర్, సిరికొండ, జైనూర్​ మండలాల్లోని గిరిజన, ఆదివాసీ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రైవేటు అప్పులతో సాగు చేసుకునే రైతులకు మళ్లీ అప్పు దొరికే పరిస్థితి లేదు. వర్షాలు తెరిపినివ్వడంతో.. ఇప్పుడిప్పుడే ఆదిలాబాద్​ జిల్లాలో నష్టం బయటపడుతోంది. వ్యవసాయశాఖ నివేదికల ప్రకారమే.. రూ.72 కోట్ల విలువైన పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. 68 వేల ఎకరాల పత్తి, 27 వేల ఎకరాల్లో సోయా మరో 9 వేల ఎకరాల్లో కంది పంట నీట మునిగింది.

పనికి రాకుండా పోయిన పొలాలు..: నిర్మల్ జిల్లాలోని స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట వరద పాలైంది. సోన్ మండలం గంజాల్, మాధాపూర్, పాక్​పట్ల గ్రామాల రైతులు పత్తి, మక్క, పసుపు పంటలు సాగు చేస్తుంటారు. అయితే స్వర్ణ జలాశయం వరద పొలాల్లోకి చొచ్చుకొచ్చి ముంచేసింది. ఇసుక మేటలు కట్టి పొలాలు పనికి రాకుండా పోయాయి. గతేడాదీ వరదలు తీవ్ర నష్టాలను మిగల్చగా.. ప్రస్తుత ప్రకృతి ప్రకోపం మరింత దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరకాలలోనూ అదే పరిస్థితి.. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్​లో వర్షాలతో పత్తి, పసుపు, కూరగాయలు, పప్పు దినుసుల పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి రైతుకు నష్టాన్ని చేకూర్చాయి.

ఇవీ చూడండి..

'కొవిడ్, స్వైన్‌ఫ్లూలాగే మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి..'

చిన్నారిపై ఆరేళ్లుగా తండ్రి, బాబాయి రేప్.. భవనం పైనుంచి దూకేసిన బాలిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.