Petrol Bunk: తక్కువ డీజిల్​ పోస్తున్నారన్న ఆరోపణలతో బంకు మూసివేత

author img

By

Published : Jun 8, 2021, 7:00 PM IST

petrol bunk closed cause of low diesel emissions at narayanpeta

అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో నారాయణపేట జిల్లాలోని భారత్​ పెట్రోలియం బంకును అధికారులు మూసివేయించారు. ఇంధన పరిమాణంలో మోసం చేస్తున్నారని ఫిర్యాదులు రాగా చర్యలు చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

నారాయణపేట జిల్లా ధన్వాడలోని భారత్ పెట్రోలియం బంకును డిప్యూటీ తహసీల్దార్​ మాచన రఘునందన్​ మూసివేయించారు. పెట్రోల్​, డీజిల్​ను తక్కువగా పోస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని అందుకే తాత్కాలికంగా బంకును మూసేస్తున్నట్లు తెలిపారు. కొందరు రైతులు డీజిల్​ను డబ్బాల్లో తీసుకెళ్తుండగా... ఎన్ని లీటర్లు పోస్తున్నారన్న విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే అదనుగా భావించి బంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని రఘునందన్​ పేర్కొన్నారు. వినియోగదారులు మోసపోతున్నారని అన్నారు.

తూనికలు కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం సమగ్ర విచారణ జరుపుతామని డిప్యూటీ తహసీల్దార్​ తెలిపారు. వినియోగదారులను మోసం చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.