Bandi Sanjay : 'గడీల రాజ్యం పోవాలి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి'

author img

By

Published : Apr 25, 2022, 10:01 AM IST

Bandi Sanjay in Narayanapet

Bandi Sanjay in Narayanapet : తెరాస నాయకులకు మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రంలో మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తే... కేసీఆర్ మాత్రం రోజంతా అబద్దాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారి భాజపాకు అవకాశమివ్వాలని కోరారి. గడీల రాజ్యం పోవాలని.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలన్నారు.

గడీల రాజ్యం పోవాలి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి

Bandi Sanjay in Narayanapet : ఎంఐఎంకు సవాల్ విసిరి పాతబస్తీలో గర్జించి, గాండ్రించిన ఏకైక పార్టీ భాజపా మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా నర్వ, పాతర్ చేడు, మంతన్ గోడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. భాజపా గెలుస్తుందనే ప్రచారంతో కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతుందని తెరాసలో మంత్రిపదవి ఆశచూపి కొట్లాట పెడుతున్నారని ఆరోపించారు.

Bandi Sanjay Padayatra : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్నికృష్ణా నదిలో విసిరిపారేస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తే... కేసీఆర్ మాత్రం రోజంతా అబద్దాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వడదెబ్బ, ఎసిడిటీ వల్ల బండి కొంత బలహీనంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పాదయాత్రకు కొంత విరామమివ్వాలని కోరగా, చికిత్స అనంతరం బండి సంజయ్ యథావిధిగా పాదయాత్ర కొనసాగించారు.

‘‘Bandi Sanjay Padayatra in Narayanapet : బోయ వాల్మీకులారా కేసీఆర్‌ చరిత్ర రాయండి. భాజపా గెలిస్తే వాల్మీకిల సమస్యను పరిష్కరిస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో ఎందుకు చేర్చరు? మజ్లిస్‌ కేసీఆర్‌ కుమ్మక్కు వల్లే హిందువులకు అన్యాయం జరుగుతోంది. బాంచన్‌ బతుకులు కావాలా? పేదల రాజ్యం కావాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వరు.. కానీ కేసీఆర్‌ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు. కేసీఆర్‌ కుటుంబం నెలకు రూ.25లక్షల జీతం తీసుకుంటోంది. తెరాస నేతలకు మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షే. కేసీఆర్‌ను గద్దే దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నాం. నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నా.. నీళ్లు రావు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు నీళ్ల కోసం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి గోదావరి నుంచి ఫాంహౌజ్‌కు నీళ్లు తెచ్చుకున్నారు. రూ.3, 4 కోట్లిస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావచ్చు. కేంద్రమంత్రి షెకావత్‌తో మాట్లాడి ఆర్డీఎస్‌ సమస్యను పరిష్కరించాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆరు నెలల్లో నీళ్లు తీసుకురావచ్చు. కేంద్ర నిధులను కేసీఆర్‌ దారి మళ్లించారు. ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోవాలి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి".

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.