మునుగోడు ప్రచారంతో నాకేం సంబంధమన్న కోమటిరెడ్డి

author img

By

Published : Aug 22, 2022, 8:57 PM IST

కోమటిరెడ్డి వెెెంకట్​రెడ్డి

Komatireddy letter to Sonia Gandhi రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సోనియాగాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లేఖ రాశారు. పీసీసీ రేవంత్ తీరుపై లేఖలో ఆయన ప్రస్తావించారు. నియోజకవర్గంలో తనకు ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Komatireddy letter to Sonia Gandhi కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి రేవంత్​ వ్యవహరశైలిపై సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రేవంత్‌రెడ్డి తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే ప్రియాంకగాంధీతో సమావేశానికి హాజరుకాకపోవడంపై లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.

రేవంత్‌రెడ్డి తీరు సీనియర్ నాయకలను అవమానించేలా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. చండూరు సభ, పార్టీలో చెరుకు సుధాకర్ చేరిక లాంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను లేఖలో పేర్కొన్నారు. రేవంత్‌తో వేదిక పంచుకోలేనంటూ సోనియాకు వివరణ ఇచ్చిన వెంకట్‌రెడ్డి.. దశాబ్దాలకుపై కాంగ్రెస్‌లో తాను పనిచేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీనియర్‌ నేతలను రేవంత్​ హోంగార్డులతో పోల్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంతో నాకు సంబంధం లేదు, పాల్గొనను. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా నాకు గుర్తింపు ఇవ్వలేదు. నాకంటే పెద్ద లీడర్లు ఉన్నారు కదా వాళ్లే గెలిపించుకుంటరు. నాకేలాంటి సంబంధం లేదు. ఇవాళ మమ్మల్ని పిలిచి మీటింగ్​కు రమ్మంటే పోయి ఏం చేయాలే. ఇప్పటికే పార్టీని సర్వనాశనం చేసిండ్రు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి పీసీసీని చేశారు. మాణిక్కం ఠాగూర్‌ అభిప్రాయాలు తీసుకున్నట్లు దొంగనాటకాలు ఆడారు.పార్టీని సర్వనాశనం చేసి నాలాంటి కార్యకర్తకు అన్యాయం చేసిండ్రు. దాని ప్రతిఫలమే తెలంగాణాలో కాంగ్రెస్‌ నాశనమైంది. కానీ నేను పార్టీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కానీ మళ్లీ మాణిక్కం ఠాగూర్​ లాంటి వాళ్లకు తీసి.. అనుభవజ్ఞులైన కమల్​నాథ్​ లాంటి నేతలను నియమించాలి. కాంగ్రెస్​ను నమ్ముకున్న వారికి తీవ్ర అన్యాయం జరిగింది.

- కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

కాంగ్రెస్‌ విధేయులమైన తాము ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని లేఖలో తెలిపారు. పరిస్థితులు ఇలాగే ఉంటే మునుగోడు ఉపఎన్నికల్లో ప్రచారం చేయలేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో రేవంత్‌ రెడ్డి తన అనుచరులతో సీనియర్లపై చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి చెప్పిన క్షమాపణలకు తాను అంగీకారం తెలిపానన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెంది చండూరు సభ నిర్వహణ, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ పార్టీలో చేరిక లాంటి అంశాలను కూడా లేఖలో ప్రస్తావించారు.

మునుగోడు ప్రచారంతో నాకేం సంబంధమన్న కోమటిరెడ్డి

ఇవీ చదవండి: ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేసీఆర్‌

భారతరత్నకు అర్హుడైన సిసోదియాపై సీబీఐ దాడులు సిగ్గుచేటు కాదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.