మునుగోడులో మెునగాడిని దించేందుకు కాంగ్రెస్​ కసరత్తు షురూ

author img

By

Published : Aug 24, 2022, 5:57 AM IST

congress

Congress hunting in Munugodu మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి. అటు భాజపా, తెరాస పార్టీలు ర్యాలీలు, సభలతో తమతమ బలాలు ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్​ మాత్రం పోయినచోటనే మరల వెతుక్కోవాలన్న చందంగా తమ పార్టీని మునుగోడులో మరో సారి గెలిపించేందుకు అన్ని మార్గాలు వెతుక్కుంటోంది.

Congress hunting in Munugodu: మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు మొదలుపెట్టింది. వారం, పది రోజుల్లో అభ్యర్థిని ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశలో కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేపు హైదరాబాద్‌ వస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అభ్యర్ధి ఎంపిక వ్యవహారాన్ని నల్గొండ జిల్లా సీనియర్ నాయకులకు వదిలివేయడంతో... రేపు జిల్లాకు చెందిన సీనియర్లతో సమావేశమై ఠాగూర్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ వస్తున్న మాణిక్కం ఠాగూర్‌...నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు జానారెడ్డి, ఆర్‌ దామోదర్‌ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఈ సమావేశానికి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ధిల్లీలో జరిగిన ప్రియాంక గాంధీ సమావేశానికి కూడా హాజరుకాలేదు. అదేవిధంగా అధిష్ఠానం పంపించే దూతలతో తాను కలువనని స్పష్టం చేస్తున్న వెంకటరెడ్డి రేపటి మాణిక్కం ఠాగూర్ సమావేశానికి కూడా హాజరయ్యేది నమ్మకం లేదని తెలుస్తోంది. దీంతో మిగిలిన ముగ్గురుతో సమావేశమై అభ్యర్ధి ఎంపిక విషయమై చర్చిస్తారని పార్టీ వర్గాల్లో భావిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.