'సీఎం కేసీఆర్​కు ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయి'

author img

By

Published : Aug 31, 2022, 9:12 PM IST

YS SHARMILA

YS Sharmila Padayatra సీఎం కేసీఆర్‌కు భాజపా, కాంగ్రెస్‌ నాయకులు అమ్ముడుపోయారని వైస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడం లేదని షర్మిల మండిపడ్డారు.

పాదయాత్రలో వైఎస్​ షర్మిల

YS Sharmila Padayatra: సీఎం కేసీఆర్​కు భాజపా, కాంగ్రెస్​ పార్టీలు అమ్ముడుపోయాయని, కాంగ్రెస్​కి ఓటు వేస్తే ఆ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నాగర్​కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అంబటిపల్లి నుంచి మొదలైన పాదయాత్ర.. కొత్త చెరువు తండా, అవుసలి కుంట, లింగాల, మగ్ధుంపుర్, నర్సాయిపల్లి క్రాస్ బల్మూర్ మండల పరిధిలోని అనంతవరం, బల్మూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. లింగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్​పై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

"వైఎస్సార్ ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు. ఆయన పథకాలు మీరు ఇంకా గుర్తు పెట్టుకున్నారు. వైఎస్సార్ వాస్తవానికి బ్రతికే ఉన్నట్లు మీరు చూపించే అభిమానంతో మహానేతకు మరణం లేనట్లు కనిపిస్తోంది. ఆరోజుల్లో ప్రతిపక్షం హేళన చేసినా ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించారు. రైతులు వైఎస్సార్ హయాంలో సంతోషంతో ఉన్నారు. మహిళలకు సున్నా వడ్డీలకు రుణాలు ఇస్తే ఆర్ధికంగా అభివృద్ధి చెందారు. ఆరోగ్యశ్రీ తో ఎంతో మంది పేదలు పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం చేయించుకున్నారు. ఫోన్ కొట్టిన 15 నిమిషాల్లో కుయ్ కుయ్ అంటూ వచ్చేది 108. ఇప్పుడు వైఎస్సార్ పాలన తెలంగాణలో లేదు. ఉద్యమ కారుడు కదా అని రెండు సార్లు అవకాశం ఇస్తే కేసీఅర్ మోసం చేయని వర్గం లేదు.ఒక్క పథకం కూడా అమలు కావడం లేదు. కేసీఅర్ పథకాలతో లబ్ది పొందామని చెప్పే వారే లేరు." -వైఎస్​ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.