ఆ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్

author img

By

Published : Jul 29, 2022, 8:20 PM IST

పాలమూరు-రంగారెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక ఐదుగురు కార్మికులు ప్రాణాలొదిలారు. ప్యాకేజీ-1 పనుల్లో భాగంగా ఎల్లూరు శివారు రేగుమాన్‌గడ్డ వద్ద సర్జ్‌పూల్‌లో కాంక్రీంట్‌ లైనింగ్‌ కోసం క్రెయిన్‌లో సామగ్రిని దింపుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కృష్ణానదిపై ప్రభుత్వం భారీవ్యయంతో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్యాకేజీ-1లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా రేగుమాన్‌గడ్డ వద్ద సర్జ్‌పనులు చేస్తుండగా ప్రమాదం చేటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. సర్జ్‌పూల్‌లో కాంక్రీట్‌ లైనింగ్‌ కోసం క్రెయిన్‌ కిందకు దింపుతుండగా ఒక్కసారిగా తీగలు తెగిపోయి లోపల ఉన్న కార్మికులపై కుప్పకూలింది.

దీంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలొదిలారు. మరణించినవారిలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఉండగా బిహార్, ఝార్ఖండ్​కు చెందిన నలుగురు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన శ్రీను, ఝార్ఖండ్‌కు చెందిన భోలేనాథ్, ప్రవీణ్, కమలేష్‌, బిహార్‌కు చెందిన సోనూకుమార్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష అనంతరం బంధువులకు అప్పగించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల వద్ద ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, భాజపాలు డిమాండ్ చేశాయి. ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం చెందటం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి ఇక్కడ చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. మృతుల కుటుంబాలను ఉస్మానియా ఆసుపత్రిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు..

ఆ ఐదుగురి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్

ఇదీ చదవండి: కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు: కేటీఆర్‌

'నోరు జారా.. క్షమించండి'.. రాష్ట్రపతి ద్రౌపదికి అధీర్ రంజన్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.