ys Sharmila: 'పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్​ది ద్వంద్వ వైఖరి'

author img

By

Published : Aug 18, 2021, 9:59 PM IST

Sharmila

పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. పోడు యాత్రలో భాగంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లింగాలలో పర్యటించిన షర్మిల..... పోడు రైతుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో గిరిజనులకు గుంట భూమి లేని పరిస్థితి నెలకొందని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి..….రైతుబంధు, రైతు బీమా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా లింగాల గ్రామంలో పర్యటించిన ఆమె... పోడు రైతుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.

అంతకు ముందు గోవిందరావుపేట మండలం పసరలో కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి లింగాల గ్రామానికి కాలినడకన వెళ్లారు. పోడు రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు చేసుకున్న రైతులు లక్షలాది మంది రైతులకు వైఎస్​ఆర్​ హాయాంలో పట్టాపాసుపుస్తకాలు ఇచ్చారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్​ గిరిజనులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు దగ్గరుంది పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. గిరిజనులకు గుంట భూమి లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతు బీమా వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన రైతుల పక్షాన పోరాటం చేస్తానన్నారు.

అడవి బిడ్డల భూములను గుంజుకున్నట్లయితే ఇదే అడవి బిడ్డలు మీ కుర్చీని మీకు లేకుండా చేస్తారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని... రేపోమాపో ఖతం చేస్తానన్న ముచ్చట ఏమైంది కేసీఆర్​ గారు..? ప్రజలకేమో ఒకపక్క నేను ఫారెస్ట్​ ఆఫీసర్లకు ఇబ్బంది పెట్టొద్దని చెబుతున్నాని చెబుతారు. ఇంకోపక్క అదే ఫారెస్ట్​ ఆఫీసర్లతో గిరిజనుల మీద దాడులు చేయిస్తారు. వీళ్లు, వాళ్లు కొట్టుకుని చస్తుంటే కేసీఆర్​గారు మాత్రం రాక్షసానందం పొందుతారు. ఇంకా ఎన్నిరోజులు ఈ నాటకాలు..?. పట్టాలు ఉన్నవాళ్ల దగ్గర పట్టాలు గుంజుకుని ఇవి మేమిచ్చినవి కావు అంటూ వాళ్ల మీదకూడా దాడి చేస్తున్నారంట..! కేసీఆర్​కు వాస్తవంగా మీ భూములు మీకిచ్చే ఉద్దేశమే లేదు. వైఎస్​ షర్మిల, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

ys Sharmila: 'పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్​ది ద్వంద్వ వైఖరి'

ఇదీ చూడండి: YS SHARMILA: సునీల్​ కుటుంబానికి ఆర్థికసాయం.. గుండెంగిలో 'నిరుద్యోగ దీక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.