CP On Immersion: నిమజ్జనం జరిగే చెరువుల వద్ద పటిష్ట బందోబస్తు: మహేశ్ భగవత్

author img

By

Published : Sep 16, 2021, 6:02 PM IST

CP On Immersion

ఈ నెల 19న జరిగే వినాయక నిమజ్జనం కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్ల పరిధిలో సమావేశాలు నిర్వహించి సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఆదివారం జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి రాచకొండ కమిషనరేట్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్​ వెల్లడించారు. విగ్రహాల నిమజ్జనం జరిగే చెరువుల వద్ద సీసీ కెమెరాలు, క్రేన్స్, విద్యుత్ దీపాలు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు.

గతంలో 2019లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9472 విగ్రహాలకు దరఖాస్తులు రాగా ఈ సంవత్సరం 6329 వచ్చినట్లు సీపీ వెల్లడించారు. ఎల్బీనగర్​, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో సమావేశాలు నిర్వహించి పోలీసులకు సూచనలిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు జోన్ల పరిధిలో వినాయక నిమజ్జనం జరిగే ప్రతి చెరువుల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా తమవంతు సహకారం అందించనున్నట్లు సీపీ మహేశ్ భగవత్ అన్నారు.

ఎల్బీనగర్​ జోన్​ పరిధిలోని సరూర్​ నగర్, నాగోల్, మన్సూరాబాద్, తుర్కయాంజల్, ఇంజాపూర్, ఇనాంగూడా, జల్​పల్లి చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. మల్కాజిగిరి జోన్​లో ఉప్పల్ నల్లచెరువు, రాంపల్లి, కాప్రా, చెర్లపల్లి చెరువులు, భువనగిరి జోన్​లో భునవగిరి, చౌటుప్పల్, బీబీనగర్ వద్ద పెద్ద పెద్ద చెరువుల వద్ద పూర్తిస్థాయిలో భద్రతా కల్పించనున్నట్లు వెల్లడించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతగా జరిగేలా చర్యలు చేపడుతామని రాచకొండ సీపీ మహశ్ భగవత్ పేర్కొన్నారు.

గణేశ్​ భక్తులందరికీ మా విన్నపం. ఆదివారం పెద్దఎత్తున నిమజ్జనం జరగబోతోంది. దీనికి సంబంధించిన పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎల్బీనగర్​, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో సమావేశాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. చెరువుల వద్ద నిమజ్జనానికి ఇబ్బందులు రాకుండా పటిష్ట బందోబస్తు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నాం. మన బయటి నుంచి కూడా పోలీస్ ఫోర్స్​ ఇవ్వడం జరిగింది. అన్ని చెరువుల వద్ద పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాం. 2019లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9472 అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం 6329 విగ్రహాలకు అప్లికేషన్లు వచ్చాయి.

- మహేశ్ భగవత్​, రాచకొండ సీపీ

సీపీ మహేశ్ భగవత్​

ఇదీ చూడండి: Ganesh Immersion: హుస్సేన్​సాగర్​కు గణనాథులు.. నిమజ్జనానికి ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.