ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు.. విద్యార్థులతో ఎమ్మెల్యే డ్యాన్స్..

author img

By

Published : Sep 16, 2022, 6:53 PM IST

మెదక్

Telangana National Unity Vajrotsavam In Medak: మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. వేడుకల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి డ్యాన్స్​ చేశారు. పిల్లలతో కలిసి స్టెప్పులేసి వారిని ఉత్సాహపరిచారు.

Telangana National Unity Vajrotsavam In Medak: మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర కళాశాలకు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బతుకమ్మ, బోనాలు, డప్పు చప్పులు, పీర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్​ చేశారు. పిల్లలతో కలిసి స్టెప్పులేసి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఆమె మాట్లాడారు.

ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు.. విద్యార్థులతో ఎమ్మెల్యే డ్యాన్స్..

అన్ని వర్గాల వారిని సమైక్యం చేయాలనే సంకల్పంతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. తద్వారా ఈరోజు బతుకమ్మ, క్రిస్మస్​, రంజాన్ వంటి పండుగలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్టు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతులకు ఉచిత కరెంటు, ఇంటింటికీ మంచినీళ్ల పథకం, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నట్టు చెప్పారు. మెదక్‌కు రైలు వచ్చిందని.. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీ వస్తుందని అన్నారు.

త్వరలో సొంత స్టలం ఉన్నవారికి డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ. మూడు లక్షలు ఇస్తామని పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చామని.. మరో 500 ఇళ్లూ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని.. ఇప్పుడు జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్​రెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌ చంద్రపాల్, మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ మల్లికార్జున్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌ లావణ్య రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: భాగ్యనగరంలో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

డ్యాన్సింగ్​ పోలీస్.. స్టెప్​ వేస్తే క్షణాల్లో ట్రాఫిక్ క్లియర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.