Manikkam Tagore: 'కాంగ్రెస్​ టైం మొదలైంది.. ఈ సారి అధికారం మాదే.!'

author img

By

Published : Oct 1, 2021, 4:46 PM IST

manikkam tagore

తెలంగాణలో కాంగ్రెస్​కు మంచి రోజులొచ్చాయని.. పార్టీకి టైం స్టార్ట్​ అయిందని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్కం(Manikkam Tagore) ఠాగూర్​ వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. మెదక్​ జిల్లా రామాయంపేటలో జరిగిన పార్టీ స్థానిక నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్(congress) అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore)​ స్పష్టం చేశారు. మొత్తం 78 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మెదక్​ జిల్లా రామాయంపేటలో జరిగిన మెదక్​ పార్లమెంటరీ నియోజకవర్గ బ్లాక్​, మండల అధ్యక్షుల సమావేశానికి మాణిక్కం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అందుకే అమిత్​ షాను కలుస్తున్నారు..

తెరాస పాలనలో బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబం అయిందని మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore)​ ఎద్దేవా చేశారు. తెరాస దుకాణం బంద్​ అయ్యే రోజులొచ్చాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రాజెక్టులో మంత్రి కేటీఆర్​ 20 శాతం కమీషన్​ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్​ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. కేసీఆర్​ దిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్​షాను కలిసి ఆయన మీద కేసులు రాకుండా చూసుకుంటున్నారని మాణిక్కం(Manikkam Tagore) ఎద్దేవా చేశారు.

టైం స్టార్ట్​ అయింది..

క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామని మాణిక్కం ఠాగూర్(Manikkam Tagore)​ పేర్కొన్నారు. దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి నుంచి కాంగ్రెస్​ పార్లమెంట్​ స్థాయీ సమేవేశాలు ప్రారంభించామని చెప్పారు. పార్టీ క్యాడర్​ చాలా పెద్దదని.. కాంగ్రెస్​కు మంచి రోజులొచ్చాయని వివరించారు.

ఇదీ చదవండి: KTR speech latest: 'సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​కు పరిశ్రమలు తీసుకెళ్తే ఓరుస్తలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.