చిరుత సంచారం...భయం గుప్పిట్లో తండావాసులు

author img

By

Published : Aug 30, 2021, 1:48 PM IST

CHIRUTHA_SANCHARAM

ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యం భయాందోళనతో బిక్కు బిక్కుమంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండా పక్కన గల గుట్టపై ఏడాది కాలంగా చిరుత సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండా పక్కన గుట్టపై చిరుత సంచరిస్తోందని.. ఆ ప్రాంతవాసులు ఎప్పటినుంచో చెబుతున్నారు. కానీ.. ఎవరూ నమ్మలేదు. చిరుత మేకలు, లేగదూడలను ఎత్తుకెళ్లి చంపి తినేసింది. అప్పటినుంచి అప్రమత్తంగా ఉన్నారు. గుట్టపై చిరుత పులి కూర్చుని ఉండగా స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో, ఫొటోలను మీడియాకు పంపారు.

చిరుత సంచారం...భయం గుప్పిట్లో తండావాసులు

అటవీశాఖ అధికారులు అక్కడ బోను ఏర్పాటు చేశారు. కానీ.. ఆ చిరుత పులి బోనులో చిక్కడం లేదు. ఇటీవల కాలంలో చిరుత పులి రెండు పిల్లలతో కలిసి ఈ ప్రాంతంలో తరచుగా కనిపిస్తుందని... ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకావడం లేదని.. కామారం తండావాసులు, మీర్జాపల్లి తండావాసులు చెబుతున్నారు.

పొలాలకు వెళ్లాలంటేనే భయమేస్తోంది, పులి ఎక్కడినుండి వచ్చి దాడి చేస్తుందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. పొలాలకు ఒంటరిగా వెళ్లడం మానేశామని చెబుతున్నారు. చిరుతపులి బారి నుంచి తమను కాపాడాలని... అటవీశాఖ అధికారులు మరిన్ని బోనులు ఏర్పాటు చేసి దానిని పట్టుకొని అటవీ ప్రాంతాలకు తరలించాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.