నిరుద్యోగుల నుంచి లక్షలు రూపాయలు వసూలు, ఇలా వెలుగులోకి

author img

By

Published : Aug 19, 2022, 4:59 PM IST

నిరుద్యోగుల నుంచి లక్షలు రూపాయలు వసూలు, ఇలా వెలుగులోకి

Collected money from the unemployed అతను సింగరేణి సంస్థలో పెద్ద ఉద్యోగి. నెలకు లక్ష వరకు వేతనం అయిన అంతటితో తృప్తి చెందని ఆయన, నిరుద్యోగులకు సింగరేణి సంస్థలో ఉద్యోగ ఇప్పిస్తానని నమ్మబలికాడు. వారి నుంచి లక్షల రూపాయల డబ్బులు వసూళ్లు చేశాడు. ఎంతటికి ఉద్యోగాలు రాకపోవడంతో నిరాశ చెందిన వారు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడగా కొత్త విషయాలు వెలుగులోనికి వచ్చాయి.

Collected money from the unemployed: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి ఎస్​ అండ్​ పీసీ విభాగంలో ఉద్యోగం చేస్తున్న మహేష్, పలువురు నిరుద్యోగులకు సింగరేణిలో క్లర్క్, ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. వారి నుంచి సుమారు 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. వారిని ఎంతకీ ఉద్యోగాల్లో పెట్టించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిరగడంతో అనుమానం వచ్చింది.

దీంతో బాధితులు మందమర్రి లోని ఎస్​ అండ్​ పీసీ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం అతనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పై అధికారులు మహేష్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో భూమి కొనుగోలు, ప్రైవేటు ఉద్యోగాలు పెట్టిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేయడంతో మహేష్​ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. అనంతరం అతనిపై పీడీ చట్టం కూడా ప్రయోగించారు.

ఆరు నెలల క్రితం జైలు నుంచి వచ్చిన అతను తిరిగి మోసాలు చేయడం ప్రారంభించారు. మహేష్ చేతిలో మోసపోయిన వారిలో ఎక్కువ మంది జార్ఖండ్ వాసులు ఉండగా తమది కూలీ కుటుంబ నేపథ్యం అని, ఉద్యోగాలు వస్తాయని ఆశతో అప్పు చేసి మరి డబ్బులు ఇచ్చామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.