'సర్కారు కొలువు కొట్టాలంటే.. వాటికి దూరంగా ఉండాలి'

author img

By

Published : May 9, 2022, 3:06 PM IST

study material distribution by ktr

KTR suggestions to job Aspirants: ఉద్యాగార్థులకు రాబోయే ఆరు నెలలు కీలకమని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఈ ఆరు నెలలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహబూబ్​నగర్​లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ మెటీరియల్​ అందజేశారు.

KTR suggestions to job Aspirants: సర్కారు కొలువు సాధించాలంటే ఉద్యోగార్థులు.. రాబోయే ఆరు నెలలూ సామాజిక మాధ్యమాలు, టీవీలకు దూరంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ 6 నెలలు వారికెంతో కీలకమని.. కష్టపడి చదివి కొలువు సాధించాలని ఆకాంక్షించారు. సుమారు 90 వేల ఉద్యోగాలతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొలువుల కుంభమేళా చేపట్టారని.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మహబూబ్ నగర్​ పట్టణంలో ఎక్స్పో ప్లాజా వద్ద శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్​లో ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి కేటీఆర్ అందజేశారు.

"ఉద్యోగార్థులకు రాబోయే ఆరు నెలలు ఎంతో కీలకం. సోషల్ మీడియాలు, టీవీలకు దూరంగా ఉండి ఉద్యోగాలు సాధించాలి. కష్టపడి చదివి సింహ భాగం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వారు ఉద్యోగాలు సాధించుకోవాలని ఆకాంక్షిస్తున్నా." -కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

మహబూబ్ నగర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు పట్టణానికి అవసరమైన నిధులను.. మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని చెప్పారు. అంతకుముందుగా తెరాస పార్టీ జెండాను ఎగురవేశారు.

అవే ఎజెండా: అంతకుముందుగా కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో యువతను ఉద్దేశిస్తూ స్ఫూర్తిదాయక ట్వీట్ చేశారు. భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కుల, మత ప్రాతిపదికన విభజనను పక్కన పెట్టి ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటితో పోటీ పడాల్సిన అవసరం ఉందని పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి, జాతీయవాదం.. యువత ఎజెండా కావాలన్న ఆయన... భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు దారులను వెతుక్కోవాలని కోరారు. ఈ కలను సాకారం చేసేందుకు యంగ్ ఇండియా కుల‌, మ‌త విభజనను ప‌క్కన పెట్టి ప్రపంచంలోని అత్యుత్తమైన వాటితో పోటీ ప‌డాలని కేటీఆర్ సూచించారు. ఇది ఇప్పుడు కాక‌పోతే.. ఎప్పటికీ కాదని ట్వీట్ చేశారు.

  • “Developmental Nationalism” should be the agenda of youngsters. India has to find its rightful place in the first world 🇮🇳

    To realise this young India needs to aspire & compete with the best in the world setting aside our parochial religious/caste divisions

    It’s now or never👍 https://t.co/LL3GmQT6DT

    — KTR (@KTRTRS) May 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: ఈవెంట్స్‌కు ఈ టెక్నిక్స్‌ ఫాలో అయితే చాలు.. పోలీస్​ జాబ్​ మీదే!

కన్నతల్లి Vs పెంచిన తల్లి .. గెలుపెవరిది?

నమ్మించి లక్షలు చోరీ.. చనిపోయినట్లు డ్రామా.. 9 నెలల తర్వాత సీన్​ రివర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.