కంటైనర్ ఇల్లు.. తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చిన కుమారులు

కంటైనర్ ఇల్లు.. తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చిన కుమారులు
Sons gift container house: మనం ఇల్లు అంటే కమ్మలతో వేసింది, పెంకిటిల్లు, రాతితో నిర్మించింది, చెక్కలతే నిర్మించింది చూసి ఉంటాం. అయితే ఇద్దరు వ్యక్తులు వినూత్నంగా ఆలోచించి కంటైనర్‌నే ఇంటిగా నిర్మించారు. ఇప్పటి వరకు కంటైనర్‌ని ఫామ్ హౌస్‌గా, హోటల్‌గా మాత్రమే వినియోగించడం చూశాం. మహబూబాబాద్‌లో ఈ కొత్త ఇంటిని చూసి స్థానికులు అంత ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ ఇల్లు ఎందుకు నిర్మించారంటే..?
Sons gift container house: తల్లిదండ్రుల సంతోషంగా చూసుకోవాలని ప్రతి కుమారుడి ఆశయం. వారు జీవితాంతం పిల్లల కోసం కష్టపడి జీవనం సాగిస్తారు. అలానే కొంత మంది కొడుకులు అమ్మనాన్నలను ఆనందంగా చూసుకోవాలని, మిగిలిన జీవితం సంతోషంగా గడపాలని ఎంతో కృషి చేస్తారు. ఆదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో కుమారులు తల్లిదండ్రులకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకొన్నారు.
చివరికి వారికి సొంతంగా ఉండడానికి ఒక ఇల్లు కట్టాలని నిర్లయించుకొన్నారు. ఆ కుమారులు వినూత్నంగా ఆలోచించి కంటైనర్‌లో ఇల్లుని ఏర్పాటు చేశారు.మహబూబాబాద్‌కి చెందిన హుస్సేన్‌కి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. వారి ఇరువురు కుమారులు అక్బర్, అఫ్జల్ కలసి కంటైనర్‌ని ఉపయోగించి ఇల్లుని నిర్మించారు. కంటైనర్‌లో వారు ఉండడానికి ఒక బెడ్ రూం, ఒక హాల్, ఆటాచ్డ్ బాత్రూం ఏర్పాటు చేశారు.
ఈ ఇంటిని ఒక్కసారిగా వారి తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపడ్డారు. తల్లి దండ్రుల ముఖాల్లో ఆనందం చూసి ఇద్దరు కుమారులు సంబరపడ్డారు. ఈ ఇంటిని నిర్మించేందుకు సుమారు రూ.5 లక్షలు ఖర్చు అయిందని కుమారులు చెప్పారు. దీన్ని హైదరాబాద్‌లో తయారు చేపించారని కుమారులు తెలిపారు. ఈ ఇల్లు 25 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుందని కుమారుడు ఆఫ్జల్ వెల్లడించారు.
ఇవీ చదవండి:
