అలుగులో చిక్కుకున్న పాఠశాల బస్సు.. స్థానికుల సాహసంతో పిల్లలు సేఫ్​..

author img

By

Published : Jul 22, 2022, 7:29 PM IST

School Bus Stuck in Flood with kids at kommulavancha

School Bus Stuck in Flood: మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచ కొత్తచెరువు అలుగు వద్ద పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. వెంటనే స్పందించి స్థానికులు బస్సులోంచి విద్యార్థులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

అలుగులో చిక్కుకున్న పాఠశాల బస్సు.. స్థానికుల సాహసంతో పిల్లలు సేఫ్​..

School Bus Stuck in Flood: మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పెనుప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని కొత్తచెరువు అలుగు పారుతోంది. ఈరోజు మరోసారి జోరుగా వర్షం కురవటంతో.. వరద ఎక్కువైంది. రోడ్డుపై నుంచి మోకాలి ఎత్తుతో నీరు వెళ్తోంది. ఈ విషయం తెలియని.. తొర్రూర్​ ఆర్యభట్ట పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో అదే దారి వెంట వెళ్లగా.. ప్రమాదవశాత్తు అలుగు మధ్యలో చిక్కుకుపోయింది.

వరద పెద్ద ఎత్తున పారుతుండటంతో.. దారి సరిగ్గా తెలియక బస్సు టైరు రోడ్డు దిగింది. బస్సు ఓ వైపు వంగిపోవటంతో డ్రైవర్​.. వెంటనే బస్సును అక్కడే ఆపేశాడు. వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. టైర్లు మునిగేలా వస్తున్న వరదను చూసి.. చిన్నారులు పెద్ద ఎత్తున అరవటం ప్రారంభించారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. బస్సులో ఉన్న చిన్నారులను హుటాహుటిన ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.