Saidabad incident: సైదాబాద్‌ చిన్నారి ఘటన బాధాకరం: మంత్రి సత్యవతి

author img

By

Published : Sep 15, 2021, 3:34 PM IST

Saidabad incident, minister satyavathi rathod

సైదాబాద్ చిన్నారి ఘటనపై(Saidabad incident) మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. నిందితుడు రాజు కోసం 10 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌లో సైదాబాద్‌లో చిన్నారిపై హత్యాచారం(saidabad incident) జరగడం దురదృష్టకరమని... నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌(sathyavathi rathod) తెలిపారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రాజు కోసం 10 బృందాలు, 200 మంది పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుడి కుటుంబసభ్యులు తమ ఆధీనంలోనే ఉన్నారని... అతడికి కుటుంబసభ్యులతో సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఆచూకీ దొరకడం కష్టంగా మారిందని తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలకు స్థల పరిశీలన చేశారు. మెడికల్ కళాశాల రావడం వల్ల ఆ ప్రాంతంలోని గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన వారు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం తప్పుతుందని తెలిపారు.

చిన్నారి మృతి చెంది ఇప్పటికి ఆరు రోజులైంది. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. దురదృష్టకరం. బాధిత కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి? నిందితున్ని ఎలా పట్టుకోవాలనే దానిపై మేం చేసేది చేస్తున్నాం. కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని మేం అన్ని రకాలుగా ఆదుకుంటాం. నిందితుడి ఆచూకీ కోసం 10 టీంలు... దాదాపు 200 మంది పోలీసులు గాలిస్తున్నారు. ఎవరితోనూ అతనికి సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం.

-సత్యవతి రాఠోడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి

రాష్ట్రంలో అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతానికి మెడికల్ కళాశాల రావడం చాలా సంతోషకరమని మంత్రి అన్నారు. మొదట నర్సింగ్ కళాశాలకు టెండర్లు పూర్తయ్యాయని... పని ప్రారంభమవుతుందని వెల్లడించారు. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ రికార్డుల ప్రకారం న్యాయం చేస్తామని హామీనిచ్చారు. సమీకృత కలెక్టరేట్‌లో అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండటం వల్ల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. భూములు కోల్పోతున్న గిరిజన రైతులు... మంత్రిని అడ్డుకుని నిరసన తెలుపుతారనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గిరిజన రైతులను అదుపులోకి తీసుకున్నారు.

ముమ్మర గాలింపు

అత్యాచారం జరిగి ఆరు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోకపోవడంతో పోలీసులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి... మూడు కమిషనరేట్ల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులను ఇప్పటికే అప్రమత్తం చేశారు.

సైదాబాద్ ఘటనపై మంత్రి సత్యవతి రాఠోడ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.