'పంతులు తండాలో .. ఇద్దరు పంతుళ్లు.. నలుగురు విద్యార్థులు'

author img

By

Published : Jun 23, 2022, 10:30 AM IST

Updated : Jun 23, 2022, 11:01 AM IST

ప్రభుత్వ బడి

Vemulapalli government school : పాఠశాల అనగానే విద్యార్థులు, ఉపాధ్యాయులతో సందడిగా కనిపిస్తుంది. కానీ కొన్నిప్రాంతాల్లో దీనికి భిన్నంగా ఉంటుంది. కొన్నిచోట్ల ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులు ఉండరు.. విద్యార్థులు ఉంటే టీచర్ల కొరత ఉంటుంది. కానీ ఈ పాఠశాలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ నలుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండడం గమనార్హం.

Vemulapalli government school : ఆ బడిలో కేవలం నలుగురు విద్యార్థులు వారికి పాఠాలు భోదించే ఉపాధ్యాయలు మాత్రం ఇద్దరు. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడా అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి శివారు పంతులు తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు 15మందికి పైగా ఉండేవారు. తండాకు చెందిన పలువురు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. వీరితో పాటు తమ పిల్లలను తీసుకెళ్లారు.

కొవిడ్‌ కారణంగా గత మూడేళ్లుగా పాఠశాల మూతపడింది. దీంతో ఇక్కడి ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు తండావాసులతో మాట్లాడి తిరిగి బడిని తెరిపించారు. ఈ క్రమంలో పాఠశాలకు కేవలం నలుగురు విద్యార్థులే హజరువుతున్నారు. వీరిలో ఓ విద్యార్థి గైర్హాజరవుతుండటంతో.. అందులో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ముగ్గురు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.

పంతులు తండాలో .. ఇద్దరు పంతుళ్లు.. నలుగురు విద్యార్థులు
Last Updated :Jun 23, 2022, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.