గుజరాత్‌లో 24 గంటల కరెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదు: నిరంజన్‌రెడ్డి

author img

By

Published : Nov 25, 2022, 4:36 PM IST

Ministers

Ministers fires on BJP Govt: రాష్ట్రంలో సాగు చేస్తున్న ఉత్పత్తులు దేశంలోనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ కేంద్రంలో పరిపాలన పక్కనపెట్టి... గుజరాత్‌ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలు మాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. కాంగ్రెస్, తెదేపా పాలనలో తరచుగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవని మంత్రి పువ్వాడ ఆరోపించారు.

Ministers fires on BJP Govt: తెలంగాణ సాగు ఉత్పత్తులు దేశంలోనే ముఖ్య పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండాలో... మంత్రి పువ్వాడతో కలిసి మూడు గిడ్డంగులను నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. దాదాపు 15 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో... ప్రభుత్వం ఈ గిడ్డంగులను నిర్మించిందని పేర్కొన్నారు. సర్కార్‌ కొనుగోలు చేసిన పంటలను గిడ్డంగుల్లో నిల్వ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. రైతు ఉత్పత్తులకు సంబంధించి గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

పరిపాలన పక్కనపెట్టి ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నారు : వ్యవసాయరంగంలోనే అద్భుతాలు సృష్టించవచ్చన్న మంత్రి నిరంజన్​రెడ్డి... ఏడాది మొత్తం పంటసాగుకు అనుగుణమైన నేలలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ పరిపాలన పక్కనపెట్టి... గుజరాత్‌ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. విమర్శలతో, ప్రభుత్వ రంగ సంస్థల దాడులతో తెరాస సర్కార్‌ను వేధిస్తున్న మోదీ సర్కార్‌... భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు మాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు.

'డిసెంబర్‌లోనే యాసంగి రైతుబంధు ఇవ్వాలని సీఎం ఆదేశం. రాబోయే రోజుల్లో రుణమాఫీ కచ్చితంగా చేస్తాం. తెలంగాణ సాగు ఉత్పత్తులు త్వరలో దేశంలోనే ముఖ్యపాత్ర పోషిస్తాయి. కేంద్రం ధాన్యం కొనకపోతే రాష్ట్రమే ఖర్చు భరించింది. గుజరాత్‌లో 24 గంటల కరెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్‌ ఎందుకు కట్టలేదు. తెలంగాణలో రైతు కేంద్రంగా పాలన సాగుతోంది.'-నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

వారి పాలనలో తరచుగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవి: గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు అనేక బాధలు పడేవారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అలాంటి కష్టాలు తప్పాయని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి నిరీక్షణ వల్ల రైతులకు ఎంతో సమయం వృథా అయ్యేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు దూరమయ్యాయన్నారు. కాంగ్రెస్, తెదేపా పాలనలో తరచుగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవని మంత్రి పువ్వాడ ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.