సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా వజ్రపు తునకలా మారుతుంది : కేసీఆర్

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా వజ్రపు తునకలా మారుతుంది : కేసీఆర్
CM KCR Election Campaign at Wyra in Telangana : నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువైన ఓటుతోనే బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వైరా ఓటర్లను కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే పంటలకు ఢోకా ఉండదని.. అప్పుడు ఖమ్మం జిల్లా వజ్రపు తునకలా మారుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR Election Campaign at Wyra in Telangana : వైరా ప్రాజెక్టు కింద నీళ్లు పారితే గతంలో పన్నులు వసూలు చేశారు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పన్నులు రద్దు చేశామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను వైరా సభకు విచ్చేసిన ప్రజలకు వివరించారు.
పోడు భూముల పంపిణీ కింద 3650 కుటుంబాలకు 7140 ఎకరాలకు పట్టాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ పోడు భూములు ఇవ్వడంతో పాటు వారికి రైతుబంధు అమలు చేశామన్నారు. అలాగే పోడు భూములకు సంబంధించి పోలీసు కేసులను ఎత్తివేశామని వివరించారు. మరోవైపు 3,659 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని.. వీటిలో వైరాలో 45 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు.
CM KCR Fires on Congrss Party : మూడు గంటల విద్యుత్ ఇస్తే పొలానికి సరిపడా నీళ్లు ఎలా పారుతాయని సభకు వచ్చిన ప్రజలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు రైతులకు 10 హెచ్పీ మోటార్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి.. 30 లక్షల పంపు సెట్లకు ఇలా వేస్తే రూ.30 వేల కోట్లు కావాలని అన్నారు. ఆ 10 హెచ్పీ పంపు సెట్లను పెడితే రైతులకు ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలన్నారు.
"పల్లెల పరిస్థితి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉండే ఎన్ని మార్పులు వచ్చాయి. ఇవన్నీ మీరు గమనించాలి. వైరా గ్రామ పంచాయతీగా ఉండేది.. దీనిని మున్సిపాలిటీ చేసుకున్నాము. వైరాలో భయంకరమైన కరవు ఉంది. కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తామని అన్నారు. ఎందుకు ఆ ప్రభుత్వం. పోడు భూములు ఇచ్చి రైతుబంధు ఇచ్చాము. కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠపాళిలో పెద్దపాము మింగినట్లే. ఈ నోట్ల కట్టల ఆసాములకు కోట్లు విలువ చేసే ఓటుతోనే బుద్ధి చెప్పాలి." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
BRS Praja Ashirvada Sabha at Wyra : ఈ తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగాన్ని(Agriculture Sector) మంచిగా అభివృద్ధి చేసుకున్నామని.. అందుకే రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని సీఎం కేసీఆర్ హర్షించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ధాన్యం ఉత్పత్తి 4 కోట్ల టన్నులకు చేరుతుందని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కింద నీళ్లు ఇస్తేనే ఓటు వేయాలని ప్రజలకు చెప్పామని.. ఐదేళ్లలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) పూర్తి చేస్తామని చెప్పి నిరూపించామన్నారు. సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) పూర్తయితే పంటలకు ఢోకా ఉండదని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా మరో 30 వేల ఎకరాలకు నీళ్లు పారిస్తామని.. అప్పుడు ఖమ్మం జిల్లా వజ్రపు తునకలా మారుతుందని తెలిపారు. నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువ చేసే ఓటుతోనే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ కోరారు.
