'ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వంటి పథకాలను సీఎం నిర్వీర్యం చేశారు'

author img

By

Published : Nov 19, 2022, 6:47 PM IST

YS Sharmila angry with CM KCR

YS Sharmila angry with CM KCR: ప్రజాప్రస్థాన పాదయాత్రలో సీఎం కేసీఆర్​పై వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. వరి వేస్తే ఉరేనన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా చూశామా అని ఎద్దేవా చేశారు.

YS Sharmila angry with CM KCR: వరి వేస్తే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాడా.. అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్‌నే అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నుంచి యాత్రను ప్రారంభించి.. పరకాల క్రాస్​ రోడ్డు, కందుగుల, ధర్మరాజుపల్లి, ఉప్పల్​ మీదగా కమలాపూర్​ మండలానికి చేరుకొని అక్కడ జరిగిన సభలో ఆమె ప్రసంగించారు.

ఎప్పుడు ఎలక్షన్​ వస్తే అప్పుడే కేసీఆర్​ ప్రజల ముందుకు వస్తారని షర్మిల విమర్శించారు. ఆయన బయటకు వచ్చాడంటే ఏదో పనిపడి.. ఓట్ల గురించేనని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఓట్లు వేయించుకొని తిరిగి ఫామ్​ హౌస్​కు వెళ్తారని ఆరోపించారు. సీఎం కేసీఆర్​ వ్యవసాయాన్ని ఆగం చేశారని, ధనిక రాష్ట్రంలో అప్పులు లేని రైతు ఉన్నాడా అని షర్మిలా ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో సర్కారు ఉందని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి హయాంలో చేపట్టిన పథకాలన్నింటిని రూపురేఖలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకున్న ఘనత వైఎస్​కే దక్కుతుందని, ఇప్పుడు ప్రస్తుత సీఎం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వంటి పథకాలను సీఎం కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారు. ఓట్లేసి తిరిగి ఫామ్​హౌస్​కు వెళ్లిపోతారు. సీఎం వ్యవసాయాన్ని ఆగం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ఘనత వైఎస్​కే దక్కుతుంది. మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. - వైఎస్​ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వంటి పథకాలను సీఎం నిర్వీర్యం చేశారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.