అమ్మ ప్రేమ కదా సార్​ ఇలానే ఉంటుంది.. కన్నీరు తెప్పించే ఓ వానరం కథ

author img

By

Published : Sep 14, 2022, 5:43 PM IST

VANARANIKI

mother love is great: అమ్మ.. అమ్మ.. లే అమ్మ నాకు ఆకలి వేస్తోంది. లే అమ్మ.. కనీసం నావైపు చూడమ్మ.. నన్ను ఎందుకమ్మ కాపాడావ్.. మనమిద్దరం కలిసే చనిపోవాల్సిందిగా.. నన్ను విడిచిపెట్టి నీవు వదిలి పోలేకపోతున్నావు.. ఎందుకమ్మా ఇలా ఇదంతా మాట్లాడుకొనేది మాటలు రాని పిల్ల వానరం బాధ. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లి వానరం, పిల్ల వానరాన్ని విడిచిపెట్టలేక తల్లి ప్రేమ పంచుతూ నేటి తరం మానవాళికి ఒక పాఠంగా చెబుతూ అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టిస్తోంది.

mother love is great: "అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. దేవుడే లేడని మనిషన్నాడు అమ్మే లేదనేవాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు. అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా.. అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా.. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేల్పు అమ్మ ఒక్కటే.. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది" అని దాశరథి కృష్ణామాచారి అన్నారు.

నిజమే ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది ఏమున్నది. నీ జీవితంలో ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడుగా నిలిచేది తల్లి ప్రేమ ఒక్కటే అని నిరూపించింది మాటలు రాని ఈ వానరం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం తన పిల్ల వానరాన్ని తీసుకొని రోడ్డు దాటబోతున్న ఓ తల్లి కోతిని లారీ ఢీ కొనడంతో తల్లికి తీవ్ర గాయలయ్యాయి. ఆ పరిస్థితుల్లోనూ పిల్లను పొట్ట కింద పెట్టుకొని చాలా జాగ్రత్తగా కాపాడుకోంది ఆ కోతి.

తన పిల్లని మాత్రం విడిచి పెట్టకుండా తన పొట్ట కింది భాగంలో దాచుకుంటూ పిల్లకి పాలు పెట్టడం, జాగ్రత్తగా చూసుకోవడం తల్లి ప్రేమకి అద్దం పడుతోంది. ఈ ఘటనను చూసి చలించిన స్థానిక యువకుడు వెంకటేష్ వెంటనే చికిత్స నిమిత్తం తల్లి, పిల్ల వానరాలను చిగురుమామిడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. గాయలతో ఉన్న వానరాన్ని చూసిన డాక్టర్​ చికిత్స చేసిన లాభం లేదని చెప్పడంతో చేసేది ఏమీ లేక తన వ్యవసాయ పొలం వద్దకు వాటిని తీసుకుపోయాడు.

వాటికి ప్రత్యేక గూడు ఏర్పాటు చేసి వెటర్నరీ డాక్టర్లను సంప్రదిస్తూ చికిత్సను అందిస్తున్నాడు. ప్రస్తుతం తల్లి వానరం ప్రాణంతో ఉన్నా ఎలాంటి కదలికలు లేకుండా కేవలం కళ్లు మాత్రమే తెరుస్తూ చూస్తోంది. పిల్ల వానరం మాత్రం తల్లి వానరం తోటే ఉంటూ దయనీయస్థితిలో కనిపిస్తుంది. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించడంతో పాటు తల్లి ప్రేమంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తోంది.

అమ్మ ప్రేమ కదా సార్​ ఇలానే ఉంటుంది.. కన్నీరు తెప్పించే ఓ వానరం కథ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.