Talasani on Sewage Plants: 'మురుగునీటి శుద్ధి కోసం రోబోటిక్ పరిజ్ఞానం'

author img

By

Published : Sep 25, 2021, 7:32 PM IST

talasani

హైదరాబాద్‌ మురుగునీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ఇందుకోసం రోబోటిక్ పరిజ్ఞానం వాడతామని స్పష్టం చేశారు.

రాబోయే రెండు దశాబ్దాల వరకు హైదరాబాద్ తాగునీటి, మురుగునీటి అవసరాలు తీర్చే బృహత్ ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. హైదరాబాద్ జలమండలి (Jalamandali) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, జలమండలి ఎండీ దానకిషోర్​లతో కలిసి మాట్లాడారు.

నగరంలోని తాగునీటి, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరిచేందుకు రూ. ఐదువేల కోట్లను కేటాయించిన సీఎం కేసీఆర్(Cm Kcr)​కు ప్రత్యేకంగా మంత్రులు ధన్యవాదాలు తెలియజేశారు. శరవేగంగా పెరుగుతోన్న గ్రేటర్ హైదరబాద్ ప్రజల అవసరాలు తీర్చేలా ఇప్పటికే ఉన్న 25 సీటీపీ ప్లాంట్ల(Ctp Plants)కు అదనంగా మరో 31 ప్లాంట్లను రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు, ఓఆర్ఆర్ అవుతల గ్రామాల ప్రజలకు సైతం తాగనీరు అందేలా కృషి చేస్తోన్న జలమండలి అధికారులను మంత్రి అభినందించారు.

కొత్తగా నిర్మించే సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి ల్యాండ్ సమస్య లేకుండా ముందుకెళ్తున్నామని.. వీటిలో 21 ప్లాంట్లు చెరువుల పక్కనే కడుతున్నామని దానకిషోర్ ఈ సందర్భంగా తెలియజేశారు. సుంకిశాల ప్రాజెక్టు పూర్తవటంతో నీటి సమస్య మరింత తీరనుందని ఆయన పేర్కొన్నారు. మ్యాన్ హోళ్ల క్లీనింగ్​కు రోబోటిక్ టెక్నాలజీ వాడకం మరింత పెంచుతామని తెలిపారు.

మురుగునీటి శుద్ధి కోసం రోబోటిక్ పరిజ్ఞానం..

గ్రేటర్​ హైదరాబాద్​ రాష్ట్రానికి, దేశానికి ప్రధానమైన గుండెకాయ. ఎన్నో రాష్ట్రాలకు, నగరాలకు అనుభవాలను నేర్పిన సిటీ హైదరాబాద్. రెండోది హెచ్​ఎండీఏ పరిధి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతివేగంగా పెరుగుతున్న సిటీ కేవలం హైదరాబాద్ మాత్రమే. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ప్రణాళిక రచించారు. కేటీఆర్ ప్రధాన భూమిక పోషించడం వల్ల ఇది సాధ్యమైంది.

-- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి

ఇదీ చూడండి: Mla Raghunandhan rao: కేసీఆర్.. చిత్తశుద్ధి ఉంటే ఎల్బీ స్టేడియానికి రా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.