DALITHABANDHU: దళితబంధు పథకంలో రవాణా వాహనాలకే మొదటి ప్రాధాన్యత

author img

By

Published : Sep 4, 2021, 4:19 AM IST

DALITHABANDHU: దళితబంధు పథకంలో రవాణా వాహనాలకే మొదటి ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో మొదటి ప్రాధాన్యత రవాణా వాహనాలకే దక్కుతోంది. దళిత సమాజ పునర్నిర్మాణం ధ్యేయంగా అమలు చేస్తున్న పథకంలో దళితవాడల్లో సర్వే చివరి దశకు చేరింది.సమగ్ర కుటుంబ సర్వే సమాచారానికి అదనంగా పెరిగిన కుటుంబాలు..ఆయా కుటుంబాల్లో ఆర్ధిక పరిస్థితులు.. ప్రస్తుతం ఏ వృత్తిలో కొనసాగుతున్నారనే అంశంపై సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా కుటుంబాలతో మమేకమైన అధికారుల బృందం వారు చెప్పే వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు.

DALITHABANDHU: దళితబంధు పథకంలో రవాణా వాహనాలకే మొదటి ప్రాధాన్యత

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు నేరుగా నిధులు ఇవ్వడం కాకుండా వారితో స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబ యజమాని చేస్తున్న పని ఏమిటి అతను అందులో రాణించాలంటే ఆర్ధిక సహాయం చేస్తే సరిపోతుందా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. పాడిగేదెల పెంపకం, మెడికల్ షాపులు,ఫర్టిలైజర్ షాపులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళిత కాంట్రాక్టర్లుగా రిజర్వేషన్‌ అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా వరకు కార్లు మినీ ట్రాన్స్‌పోర్టు వాహనాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. రెండో స్థానంలో ట్రాక్టర్ల ఎంపిక ఉంటే మూడో స్థానంలో మినీ సూపర్ మార్కెట్లను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. దళిత బంధు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేయడంతో పాటు ఆఫ్‌లైన్లోనూ రాసుకుంటున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో నిర్దిష్ట గడువులోపు సర్వే పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.సర్వే గురించి ముందుగానే గ్రామంలో నగారా వేయిస్తుండటంతో లబ్దిదారులు అందుబాటులో లేరనే పరిస్థితి ఎదురు కావడం లేదని షెడ్యూల్‌ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

చేస్తున్న పనులకు అనుగుణంగా..

ప్రధానంగా 30రకాల వ్యవసాయ, రవాణా, ఉత్పత్తి, రీటైల్‌, సేవా రంగాలను ఐదు భాగాలుగా విభజించి ఆయా రంగాలను ఎంపిక చేసుకోమని సూచిస్తున్నారు. ఆయా కటుంబాల స్థితిని బట్టి ఏ యూనిట్ తీసుకొంటే అణువుగా ఉంటుందో అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మినీ డైరీ, ట్రాక్టర్, కోడిపిల్లల పెంపకంతో పాటు ఆటో ట్రాలీ, వరినాటు యంత్రంతో పాటు పవర్ టిల్లర్‌, పందిరి కూరగాయల సాగుకు అనుమతించనున్నారు. ట్రాన్స్‌పోర్టు రంగంలో ఏడుగురు ప్రయాణించే ఆటో, ఆటో రిక్షా 3యూనిట్లు, 3చక్రాల సరుకుల రవాణా ఆటో, 4చక్రాల ఆటో సరకు రవాణాకు అవకాశం ఉంది. ఉత్పత్తి పథకాల్లో ఐరన్ గేట్స్‌ గ్రిల్స్‌ తయారీతో పాటు ఆటో ట్రాలీ, కాంక్రీట్ మిశ్రమం, సిమెంటు ఇటుకలు,మట్టిఇటుకలు,కాంక్రీట్ మిశ్రమం తయారీ, ఆయిల్ మిల్‌, వెట్‌గ్రైండర్‌, బియ్యం పిండి తదితర యూనిట్లకు అవకాశం ఉంది. తమ ఇళ్లకు వచ్చిన అధికారులు తాము చేస్తున్న పనులకు అనుగుణంగా పలు సూచనలను చేస్తున్నారని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

సమగ్ర సర్వే సమాచారానికి అదనపు సమాచారంతో పాటు స్వయం ఉపాధికి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారో గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తూ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ వివరాలు నమోదు చేస్తున్నారు.

ఇదీ చదవండి: CM KCR LETTERS: గొప్పగా ఎదిగేందుకే దళితబంధు.. లబ్ధిదారులకు సీఎం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.