Leopard spotted in kamareddy: అధికారులకు ఆ చిరుత చుక్కలు చూపిస్తోంది!

author img

By

Published : Sep 30, 2021, 2:14 PM IST

Leopard spotted

ఓ చిరుత అధికారుల పన్నిన వలకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ ఘటన బీర్కూరు మండలంలో చోటు చేసుకుంది.

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరించింది. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ఇసుక రీచ్​లో తిరుగుతున్నట్లు సీసీ కెమెరాలో నమోదైైంది. చిరుతన బంధించడానికి అటవీ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో మండల కేంద్ర పరివాహక ప్రాంతాల్లో చిరుత విచ్చలవిడిగా సంచరిస్తోంది. చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు త్వరగా చిరుతను బంధించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: చేతికర్రతోనే చిరుతను తరిమికొట్టిన బామ్మ..!

leopard spotted in kamareddy: నివాస ప్రాంతాల్లో చిరుత సంచారం.. అప్రమత్తంగా ఉండండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.