Kodipandalu 2022: మూడు రోజులుగా కోడిపందెలు.. ఏపీలో కాదండి.. మనదగ్గరే!

author img

By

Published : Jan 15, 2022, 12:40 PM IST

Kodipandalu 2022

Kodipandalu in Kamareddy: మూడు రోజుల నుంచి కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేలే కదా.. ఏపీలోనే అనుకుంటున్నారా? కాదండోయ్.. కామారెడ్డిలోనే ఈ పందేలను నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లేసరికి ఏమైందంటే..

Kodipandalu 2022: సంక్రాంతి అంటే కోడి పందేలు. కోడి పందేలంటే గుర్తుకువచ్చేది ఆంధ్రప్రదేశ్‌. కానీ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 3 రోజులుగా కోడి పందేలు నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు మాచారెడ్డి మండలం చుక్కపూర్ అటవీప్రాంతంలో పందెం రాయుళ్లను పట్టుకున్నారు.

Kodipandalu 2022
కామారెడ్డిలో 3 రోజులుగా యథేచ్ఛగా కోడిపందెలు నిర్వహణ

పోలీసుల రాకతో జూదరులు పరుగులు తీశారు. పోలీసులు చాకచక్యంతో నిందితులను అరెస్ట్ చేసి.. పోలీస్​ స్టేషన్​కు తరలించారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ జాన్‌రెడ్డి, మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడుల్లో 54 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 20 వేల నగదు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Kodipandalu 2022
కామారెడ్డిలో 3 రోజులుగా యథేచ్ఛగా కోడిపందెలు నిర్వహణ
Kodipandalu 2022
కామారెడ్డిలో 3 రోజులుగా యథేచ్ఛగా కోడిపందెలు నిర్వహణ

ఇదీ చూడండి: Extend Holidays for Educational Institutes: రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.