Dharur Road Accident Today : గద్వాల జిల్లాలో ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Published: May 20, 2023, 12:04 PM


Dharur Road Accident Today : గద్వాల జిల్లాలో ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Published: May 20, 2023, 12:04 PM
Dharur Road Accident Today : ఎప్పుడూ ఏ ప్రమాదం ముంచుకువస్తుందో ఎవ్వరూ ఊహించలేరనేది పెద్దల నానుడి. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా.. కొన్ని సార్లు ఇతరులు చేసిన తప్పులకు ఎందరో అమాయకులు బలవుతున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
Dharur Road Accident Today : రాష్ట్రంలో రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల జరిగిన.. రెండు రోడ్డు ప్రమాదాలు.. బాధిత కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలకు అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. స్నేహితురాలి పెళ్లికి ముందు పార్టీ చేసుకుందామని కారులో సరదాగా బయల్దేరిన మిత్రులంతా ఊహించని రోడ్డు ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది. ఇక ఇవాళ ఉదయం జరిగిన మరో రోడ్డు ప్రమాదం ఇంకో కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుని వారి ఫ్యామిలీలో తీరని విషాదాన్ని నింపింది.
Gadwal Road Accident Today : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధరూరు మండలంలోని రాయచూరు రహదారిపై శనివారం తెల్లవారుజామున.. గద్వాల నుంచి రాయచూరుకు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు గద్వాల పట్టణానికి చెందిన జములమ్మ, అర్జున్, వైశాలి పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు మృతదేహాలను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Road Accident at Khanapur : మరోవైపు శుక్రవారం రోజున రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలోని ఖానాపూర్ కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో అంతులేని వేదనను మిగిల్చింది. అతివేగం, నిర్లక్ష్యం నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఒకరు బ్రెయిన్ డెడ్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన ఎమిలిపురం సత్తిబాబు.. స్థానిక శ్రీసాయి రెసిడెన్సీ అపార్టుమెంటులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి దివ్య, అర్జున్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Khanapur Road Accident Update : దివ్యకు జూన్ 2న పెళ్లి నిశ్చయమవడంతో.. ఇరుగుపొరుగున ఉండే స్నేహితులతో కలిసి గండిపేటలోని ఓషన్ పార్కుకు బయలుదేరి వెళ్లారు. నిజాంపేటకు చెందిన బైక్ మెకానిక్ ప్రసాద్‌ను డ్రైవర్‌గా తీసుకుని.. ఈదులపల్లి శివారెడ్డికి చెందిన కారులో బయలుదేరి వెళ్లారు. కారులో ఏడుగురే ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ.. డ్రైవరుతో కలిపి మొత్తం 12మంది ఎక్కారు. ఓషన్ పార్కు దిశగా వెళ్తున్న కారు.. ఖానాపూర్ గ్రామం దాటగానే ముందున్న బస్సును ఓవర్‌టేక్ చేసి రోడ్డుపక్కనే ఆగిఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది.
ఈ సమయంలో వేగం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్లు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద ధాటికి అంకిత, అర్షిత, నితిన్ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రుల్ని మెహదీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రి తీసుకెళ్లుగా చికిత్స పొందుతూ తాటి అమృత్ మరణించాడు. వాహనాన్ని నడిపిన ప్రసాద్ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్‌కుమార్, అర్జున్ పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురు స్వల్పగాయాలతో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి : New Bride Suicide in Hyderabad : పెళ్లైన 14 రోజులకే నవవధువు ఆత్మహత్య.. కారణమదేనా..!
భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ప్రియుడి కోసమే..
