attack on Asha worker: కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నాక జ్వరం వచ్చిందని.. ఆశావర్కర్​పై దాడి

author img

By

Published : Oct 11, 2021, 9:26 PM IST

corona vaccine

కరోనా టీకా వేసుకొంటే.. జ్వరం వచ్చిందని.. వ్యాక్సినేషన్​ (corona vaccination)చేసిన ఆశావర్కర్​పై దాడి చేశారు (attack on Asha worker). ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. దాటి ఘటనపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. కలెక్టరేట్​లోనూ బాధితులు ఫిర్యాదు చేశారు.

attack on Asha worker: కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నాక జ్వరం వచ్చిందని.. ఆశావర్కర్​పై దాడి

గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ (corona vaccination)జరుగుతోంది. వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజుల్లో ప్రజల్లో చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఉండేవి. స్థానిక ప్రభుత్వాలు, అధికారులు.. ప్రజల్లో అవగాహన కల్పించారు. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో.. చిన్నగా అస్వస్థత, తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం వస్తాయని.. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదంటూ అవగాహన కల్పించారు. కానీ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కరోనా టీకాపై అనుమానాలు వీడలేదని తాజా ఘటనతో తెలుస్తోంది.

వ్యాక్సిన్​ వేసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యాడంటూ.. టీకా వేసిన ఆశావర్కర్​పై (attack on Asha worker) దాడిచేశారు. ఏమీ కాదని చెప్పినా వినకుండా దాడిచేశారని ఆమె పోలీస్​ స్టేషన్​ ఫిర్యాదు చేశారు. శనివారం దాడి జరగ్గా.. ఆదివారం నాడు బాధితులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇవాళ కలెక్టరేట్​లో సంబంధిత అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం మల్లాపురం గ్రామంలో జరిగింది.

అసలేమైందంటే..

మల్లాపురంలో ఈనెల 9న.. వ్యాక్సినేషన్​ డ్రైవ్​ చేపట్టారు. ఈ ప్రక్రియలో గ్రామంలోని చాలా మంది టీకాలు వేసుకున్నారు. వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో ఒకరికి జ్వరం వచ్చింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు.. టీకా వేసిన ఆశావర్కర్​ ఇంటికి వెళ్లి దాడిచేసినట్లు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది.

ఆశావర్కర్​ల నిరసన..

ఆశావర్కర్​పై దాడిని నిరసిస్తూ పలువురు ఏఎన్​ఎంలు కలక్టరేట్​ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము వ్యాక్సినేషన్​ చేస్తున్నామని ఆశావర్కర్లు తెలిపారు. టీకా వల్లే జ్వరం వచ్చిందని.. వ్యాక్సినేషన్​ చేసిన ఆశావర్కర్​ ఇంటిపై దాడిచేయడం (attack on Asha worker)దారుణమన్నారు. గ్రామాల్లో ఆశావర్కర్లకు భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలక్టరేట్​లో వినతిపత్రం అందించారు. తనపై పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఈనెల 9న మల్లాపురంలో వ్యాక్సినేషన్​ చేశాం. ఆధార్​ నంబర్​లో తప్పుందని సాయంత్రం 6 గంటలకు ఆయనకు కాల్​ చేశా.. అప్పుడు బాగానే మాట్లాడారు. రాత్రి 9.30 గంటలకు వాళ్ల బంధువులు మా ఇంటి మీదకు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. ఆ సమయంలోనే.. వారి ఇంటికి రమ్మన్నారు. దారి మధ్యలో వారు గొడవ చేసి.. నాపైన, నాకు తోడుగా వచ్చిన బంధువులపైనా దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి వెళ్లి చూస్తే.. టీకా తీసుకున్న వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నారు. కావాలనే మాపై దాడి చేశారు.'

- బాధిత ఆశావర్కర్​

ఇదీచూడండి: DH Srinivas rao: 'కరోనా ఇంకా పోలేదు.. ఈ 3 నెలలు జాగ్రత్తలు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.