అధిక వర్షాలతో పొలాల్లో ఇసుక మేటలు.. అన్నదాతల ఆవేదన

author img

By

Published : Aug 11, 2022, 5:31 PM IST

అన్నదాతల ఆవేదన

Sand dunes in the fields: అధిక వర్షాలతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లటంతో దిగువ ఉన్న పొలాల్లోని పంట కొట్టుకుపోయింది. దీనికి దోడు ఇసుక మేటలు వేయడంతో... వాటిని తొగించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు.

అధిక వర్షాలతో పొలాల్లో ఇసుక మేటలు.. అన్నదాతల ఆవేదన

Sand dunes in the fields: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షాలు రైతులను ఆగమాగం చేశాయి. గతనెలలో వరుసగా కురిసిన వర్షాలకు... జిల్లాలోని పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. పంటలు నీట మునగడంతో పాటు... పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో... వరదలు పరివాహక ప్రాంతాల్లోని పంట భూములపై వెళ్లడంతో... ఇసుక పరుచుకుంది. దీంతో పంట నష్టపోయి దిగాలు చెందుతున్న రైతులకు... ఇసుక మేటలు మరింత భారాన్ని మోపుతున్నాయి. వాటిని తొలగించేందుకు అదనపు భారం పడనుంది.
జిల్లాలో కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్, పలిమెల మండలాల్లో 734 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని, అధికారులు ప్రాథమిక నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ ఐదు మండలాల్లో 22 వేల 357 పత్తి, 1939 ఎకరాల వరినారు, 882 ఎకరాల్లో ఇతర పంటలు నీట మునిగాయని నివేదికలు సమర్పించారు. పంట నష్టానికి పరిహారం అందిస్తారు. కానీ ఇసుక మేటలు వేస్తే వ్యవసాయ శాఖ గతంలో ఎన్నడూ పరిహారం ఇవ్వలేదు. పంట నష్టంతో పాటు ఇసుక మేటలు తొలగించేందుకు కూడా పరిహారం చెల్లించి, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇసుక రీచ్‌లను తలదన్నేలా... పొలాల్లో మేటలు వేసిన ఇసుకను ప్రభుత్వమే తొలగించి ఆర్థికంగా ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి: 'గతంలో మాదిరిగా పోటీచేస్తే కాంగ్రెస్‌ గెలిచే పరిస్థితిలేదు.. అందుకే..'

'నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నానా?'.. మోదీ ఆరోపణలపై సీఎం కౌంటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.