MLA VIRAL VIDEO: ఎమ్మెల్యే సారు.. డుగ్గు డుగ్గు సాంగు..

author img

By

Published : Sep 6, 2021, 12:22 PM IST

BULLET BANDI

'నీ బుల్లెట్​ బండెక్కి వచ్చేత్తాపా' పాటకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి... పెద్దల వరకు అందరినీ ఈ పాట ఆకట్టుకుంది. ఇప్పుడు ఏ ఫంక్షన్​లో చూసినా ఈ పాటే వినిపిస్తోంది. తాజాగా చిల్పూర్ మండలంలోని పల్లగుట్టలో అంబేడ్కర్​ విగ్రహావిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సైతం ఈ పాటకు స్టెప్పులు వేశారు. చిన్నారులతో కలిసి ఉత్సాహంగా కాలు కదిపారు.

జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో అంబేడ్కర్​ విగ్రహ ఆవిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిన్నారులతో కలిసి బుల్లెట్​ బండి (bullet bandi) పాటకు డ్యాన్స్​ చేశారు. కార్యక్రమ అనంతరం స్టేడిపైనే పిల్లలతో కలిసి కాలు కదిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఎమ్మెల్యే రాజయ్య డాన్స్

ఈ మధ్యకాలంలో బుల్లెట్​ బండి పాట (bullet bandi song) ఎంతలా పాపులర్​ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఓ పెళ్లి వేడుకలో కాబోయేవాడిని మెప్పించడానికి వధువు వేసిన డ్యాన్స్​ సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఏ ఫంక్షన్​లో చూసిన బుల్లెట్​ బండి పాట లేదంటే అది ఫంక్షన్​ కాదేమో అన్నంతగా అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బుల్లెట్​ బండి పాట లేనిదే వేడుక లేదు. మాట తిరిగిన చిన్నారి మొదలు పండు ముసలి వరకు నాలుకపై బుల్లెట్​ పరుగులు పెడుతూనే ఉంది.

MP Kavitha: బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ కవిత

అందరి నోటా... అదే పాట

పెళ్లి వేడుకలు, ఆస్పత్రులు, ఇతర ఫంక్షన్లలో బుల్లెట్​ బండిపాటకున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఇటీవల ఏదైనా వీడియో వైరల్​ అయ్యిందంటే... వెంటనే అందరికీ వచ్చే అనుమానం బుల్లెట్​ బండిపాటే అని.. మరి అంత క్రేజ్​ వచ్చింది ఈ పాటకు. తాజాగా ఈ పాటకు తన డ్యాన్​ను జతచేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాజయ్య.. స్థానికంగా ఉన్న చిన్నారులతో కలిసి స్టేజిపైనే బుల్లెట్​ బండి పాటకు స్టెప్పులేశారు. సాక్ష్యాత్తు ఎమ్మెల్యే తమతో డ్యాన్స్​ చేస్తుండడంతో ఆనందంతో పిల్లలు కేరింతలు కొడతూ డ్యాన్స్​ చేశారు. నియోజకవర్గంలోని చిల్పూర్​ మండలం పల్లగుట్టలో అంబేడ్కర్​ విగ్రహ ఆవిష్కర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజయ్య... కార్యక్రమ అనంతరం పిల్లలతో కలిసి స్టేజిపైనే స్టెప్పులు వేశారు. బుల్లెట్​ బండి పాటకు తనదైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తమతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్​ చేస్తుండడంతో చిన్నారుల ఆనందానికి అవధుల్లేవు.

ఇదీ చూడండి: పక్షవాతం రోగితో నర్సు 'బుల్లెట్​ బండి' డాన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.